పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్( michael Jackson ) గురించి స్పెషల్‌గా పరిచయం అవసరం లేదు.ఈ అమెరికన్ సింగర్ థ్రిల్లర్, బిల్లీ జీన్, స్మూత్ క్రిమినల్, డేంజరస్ వంటి పాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు.
తన మూన్ వాక్ డ్యాన్స్‌తో అందర్నీ అబ్బురపరిచాడు.స్ట్రీట్ డ్యాన్స్‌ను పాపులర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
అచ్చం రోబోలాగా డ్యాన్స్ చేయడంలో కూడా ఒక్క మైఖేల్ జాక్సన్ కే సాధ్యమైంది.మైఖేల్ జాక్సన్ లాంటి వ్యక్తి గతంలో పుట్టలేదు.
భవిష్యత్తులో కూడా పుట్టబోడు అని చెప్పుకోవచ్చు.అంత గొప్ప ఆర్టిస్టుకు ఇండియా అంటే చాలా ఇష్టం ఉండేది.
ఒకానొక సమయంలో ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్( AR Rahman ) “తమిళంలో ఒక పాట పాడాలి సార్” అని అడిగినప్పుడు సంతోషంగా ఒప్పుకున్నాడు.ఆ సమయంలో డైరెక్టర్ శంకర్, రజనీకాంత్ కలిసి “రోబో” సినిమా ( “Robo” movie )రూపొందించే పనిలో ఉన్నారు.
అప్పుడే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కొనసాగుతున్నాయి.ఎ.ఆర్.రెహమాన్ నేమో లాస్ ఏంజిలిస్‌కు వెళ్లారు.
అమెరికా వెళ్ళిన తర్వాత రెహమాన్ కు మైఖేల్ జాక్సన్‌ని ఒక్కసారైనా చూడాలి అతనితో మాట్లాడాలి అని ఎంతో తపనపడ్డారు.తన మేనేజర్ ద్వారా జాక్సన్ పి.ఎ.తో మాట్లాడించాడు.అయితే జాక్సన్ పి.ఎ మీరు కలవచ్చు సార్ అభ్యంతరం ఏమీ లేదు అంటూ రెహమాన్ కి రిప్లై ఇచ్చాడు.వారం రోజుల దాకా ఎలాంటి ఆన్సర్ రాలేదు.
మరోవైపు ఏఆర్ రెహమాన్ ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు సంపాదించుకున్నట్లు ప్రకటన వచ్చింది.
ఇంకో వైపు జాక్సన్ నుంచి రెహమాన్‌కి మెయిల్ వచ్చింది.కలవచ్చు అనేది ఆ ఈమెయిల్ సారాంశం.
ఆస్కార్‌లో అవార్డు ( Oscars )గెలిస్తేనే మైఖేల్ జాక్సన్‌ను కలుస్తానని ఏఆర్ రెహమాన్ తనకి తాను చెప్పుకున్నాడు.అందుకే వెంటనే జాక్సన్‌కి రెహమాన్ ఏ విషయమూ చెప్పలేదు.
తర్వాత.
ఆస్కార్ అకాడమీ అవార్డుల వేడుకలో పార్టిసిపేట్ చేశారు రెహమాన్.‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ( Slumdog Millionaire )సినిమాలోని ‘జయహో.’ పాట కంపోజ్ చేసినందుకు ఆయనకు ఆస్కార్ అవార్డు లభించింది.
అది రెహమాన్ కెరీర్ లోనే అతిపెద్ద విజయాన్ని చెప్పుకోవచ్చు.అయితే ఆ విజయాన్ని ఆస్వాదించడం కంటే మైఖేల్ జాక్సన్ ను కలుసుకోవడమే తనకు ముఖ్యం అన్నట్లు రెహమాన్ ప్రవర్తించాడు.
ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ ముగిసిన నెక్స్ట్ రోజు సాయంత్రమే మైఖేల్ జాక్సన్‌ను మీట్ అయ్యేందుకు రెహమాన్ వెళ్లారు.అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ను ఓ రూమ్‌లో కూర్చోబెట్టారు.
కొంతసేపటికి హ్యాండ్ గ్లోవ్స్ ధరించిన ఒక వ్యక్తి అదే రూమ్ లో అడుగు పెట్టారు.అది మరెవరో కాదు కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్! అతని చూడగానే రెహమాన్ చిన్న పిల్లాడు లాగా చాలా సంతోషంగా ఫీలయ్యారు.
జాక్సన్ కూడా రెహమాన్‌తో చాలా ఆప్యాయంగా మాట్లాడాడు.ఆ మధుర క్షణాలు తనకు ఎప్పుడూ గుర్తు ఉంటాయని ఈ మ్యూజిక్ కంపోజర్ ఎప్పుడూ చెబుతుంటారు.ఈ విషయం శంకర్ కి తెలియడంతో రోబో సినిమాలో ఓ తమిళ పాట పాడిస్తే బాగుంటుంది కదా అని అడిగారట.రెహమాన్ అందుకు ఒప్పుకొని జాక్సన్ ను అడగ్గా సరే అని కూడా చెప్పాడట.
కానీ కొన్ని రోజుల తర్వాత మైఖేల్ జాక్సన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు.ఒక సంవత్సర కాలంలోనే 50 ఏళ్ల వయసులోనే ఆయన చనిపోయాడు.
దీనివల్ల రెహమాన్ కోరిక నెరవేరలేదు.