మెగా హీరోలకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అల్లు అర్జున్( Allu Arjun ) స్టార్ స్టేటస్ ను అందుకోవడంలో మెగా హీరోల పాత్ర ఎంతో ఉంది.
అయితే అల్లు అర్జున్ వైసీపీ నేత తరపున ప్రచారం చేయడం మెగా హీరోలకు అస్సలు నచ్చలేదనే సంగతి తెలిసిందే.అల్లు అర్జున్ ఇందుకు సంబంధించి సంజాయిషీలు ఇచ్చుకున్నా బన్నీపై నాగబాబు తన కోపాన్ని ప్రత్యక్షంగానే వెల్లడించారు.
అయితే బన్నీపై పవన్ కూడా కోపంగానే ఉన్నారని పవన్ కామెంట్ల ద్వారా అర్థమవుతోంది.ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) 40 సంవత్సరాల క్రితం సినిమాలలో హీరో అడవులను కాపాడేవాడని ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయిందని చెప్పుకొచ్చారు.
ఒక సినిమాకు సంబంధించిన వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం నాకు కష్టం అని అది బయటకు మంచి మెసేజ్ ను ఇవ్వలేదని ఆయన తెలిపారు.
పుష్ప ( Pushpa ) గురించి పవన్ కళ్యాణ్ రియాక్ట్ కావడం అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.బన్నీ పుష్ప సినిమాలో గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే వ్యక్తి పాత్రలో నటించారు.ఆ పాత్ర విషయంలో కొన్ని విమర్శలు ఉన్నా ఆ విమర్శలకు చెక్ పెట్టే విధంగా పుష్ప ది రూల్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.
పవన్ టార్గెట్ చేయడంతో పుష్ప 2 సినిమాకు( Pushpa 2 ) మెగా ఫ్యాన్స్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
పుష్ప ది రూల్ మూవీ ఈ ఏడాది డిసెంబర్ నెల 6వ తేదీన విడుదల కానుంది.పుష్ప ది రూల్ మూవీ ఏకంగా 400 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగింది.పుష్ప ది రూల్ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాల్సి ఉంది.