వినేష్ ఫొగట్ డిస్ క్వాలిఫై కావడానికి కారణం ఆ వ్యక్తే..??

ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్స్‌కు మొట్టమొదటి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫొగట్( Vinesh Phogat ) చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే అయితే ఆ సంతోషం ఆమెకు ఎంతో కాలం నిలవలేదు.నిర్దేశించిన 50కేజీల బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందని చెబుతూ ఆమెను మొత్తం ఈవెంట్ నుంచి బయటికి గెంటేశారు.

 Why Vinesh Poghat Disqualified From Olympics Details, Vinesh Poghat, Wrestler Vi-TeluguStop.com

అంతేకాదు, ఐవోసీ 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో ఆమెను లాస్ట్ ప్లేస్‌లో ఉంచి బాగా అవమానించింది.

సెమీస్‌లో వినేశ్ చేతిలో ఓడిన క్యూబా రెజ్లర్ గుజ్‌మాన్( Guzman ) ఫైనల్‌కు క్వాలిఫై అయి ఓడిపోయింది కానీ సిల్వర్ పతకం ఆమెను వరించింది.ఇదిలా ఉంటే ఒలింపిక్ విలేజ్‌లో వినేష్‌కు చాలా అన్యాయం జరిగిందని అంటున్నారు.50కేజీల వెయిట్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత రెజ్లర్లదే.కానీ దానికంటే ఎక్కువ బరువెక్కి వినేష్‌ ఫొగట్‌యే తప్పు చేసిందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.సపోర్టింగ్ స్టాఫ్‌( Supporting Staff ) తప్పుందని మరికొందరు విమర్శిస్తున్నారు.వినేష్ అందరినీ మోసం చేసి 53కిలోల విభాగంలో కాకుండా 50 కేజీల విభాగంలోకి దిగిందని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అయితే టీమ్ ఇండియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్‌షా పార్దీవాలా, కోచ్, న్యూట్రిషనిస్ట్, ఐవోఏ చీఫ్ పీటీ ఉష( PT Usha ) మాత్రం వినేష్ తప్పు లేదంటూ స్పష్టం చేశారు.

ఇది సపోర్టింగ్ స్టాఫ్ చేసిన తప్పు వల్లే ఆమె బంగారు పతకం కోల్పోయిందని పి.టి.ఉష ఘంటాపథంగా చెబుతోంది.

Telugu Drdinshaw, Indian Olympic, Paris Olym, Pt Usha, Vinesh Poghat, Vineshpogh

రెజ్లింగ్‌లో( Wrestling ) ఏ ఈవెంట్ అయినా రెండు రోజులే జరుగుతుంది.అయితే ఈసారి ఒలింపిక్స్‌లో( Olympics ) మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం మ్యాచ్‌లు మంగళ, బుధవారాలు జరిగాయి.ఈ 2 డేస్ ఉదయం పూట బరువు కొలతలు తీసుకున్నారు.

మామూలుగా ఏ రెజ్లర్ అయినా నార్మల్ వెయిట్ కంటే కాస్త తక్కువ ఉండే బరువు విభాగంలోనే ఆడతారు.వినేష్‌ ప్రత్యర్థులు కూడా 52-53 కిలోల దాకా బరువు ఉంటారు.

న్యూట్రిషనిస్ట్‌లు రెజ్లర్లకు బరువు కొలిచే ముందు మాత్రం ఆహారం నీళ్లు ఇవ్వరు.సోనా-బాత్, ట్రెడ్‌మిల్, స్కిప్పింగ్ వంటివి చేయించి శరీరంలోని నీరు బయటికి పోయేలాగా చేస్తారు.

తాగే వాటర్ రెజ్లర్ల బరువును చాలా త్వరగా పెంచుతాయి.ఆఫ్ లీటర్ వాటర్ తాగిన కేజీ దాకా రెజ్లర్లు బరువు పెరిగే ఛాన్స్ ఉంది.

బరువు కొలత కరెక్ట్ గా ఉందని చెక్ చేయించుకున్నా తర్వాత వాళ్లు పోటీకి సిద్ధమవుతారు.ఆ సమయంలో హై ఎనర్జీ ఫుడ్, నీళ్లు తీసుకోవడం ద్వారా శక్తిని పొందుతారు.

Telugu Drdinshaw, Indian Olympic, Paris Olym, Pt Usha, Vinesh Poghat, Vineshpogh

న్యూట్రిషనిస్ట్‌లకే( Nutritionists ) వారికి ఎప్పుడూ ఆహారాన్ని ఇవ్వాలి అనేది చూసుకోవాలి.మంగళవారం బరువు కొలత సమయంలో వినేశ్ ఫొగట్ కరెక్ట్ వెయిట్ ఉంది.దాని తర్వాత ఆమె ఎనర్జీ ఫుడ్, వాటర్, మొత్తంగా 1.5 కేజీల న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంది.చివరికి కోచ్ వెయిట్ చూస్తే ఆమె చాలా ఎక్కువ బరువు పెరిగిపోయి కనిపించింది.న్యూట్రిషనిస్ట్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ బుధవారం ఉదయం లోపు వెయిట్ తగ్గిస్తానని చెప్పినట్లు డాక్టర్ దిన్‌షా పార్దీవాలా( Dr.Dinshaw Pardiwala ) వెల్లడించారు.

Telugu Drdinshaw, Indian Olympic, Paris Olym, Pt Usha, Vinesh Poghat, Vineshpogh

కానీ మంగళవారం సాయంత్రం బౌట్‌కు బుధవారం వెయిట్-ఇన్‌కు మధ్య సమయం తక్కువగా ఉండటంతో బరువు తగ్గించడం సాధ్యం కాలేదు.ఉదయం 7.15 నుంచి 7.30 మధ్య బరువు కొలతలు చేయించుకోవాల్సి ఉంటుంది.వినేష్ చేత మంగళవారం రాత్రంతా చాలా కఠినమైన ఎక్సర్‌సైజ్‌లు చేయించారు.

ఆమె నీళ్లు తాగకుండా సోనా బాత్ చేసింది.వెయిట్ తగ్గించడానికి హెయిర్ కట్ కూడా కత్తిరించుకుంది.

జెర్సీ కొలతలు సైతం తగ్గించుకుంది.ఎంత కష్టపడి చాలా బరువు తగ్గింది కానీ 100 గ్రాములు మాత్రం తగ్గించుకోలేకపోయింది ఒక గంట పర్మిషన్ ఇవ్వాలి అని అడిగితే ఐవోసీ ఒప్పుకోకుండా ఆమెను డిస్‌క్వాలిఫై చేసింది.

వినేశ్ డైటీషియన్ కమ్ న్యూట్రిషనిస్ట్ ఫుడ్ విషయంలో చేసిన తప్పిదమే ఆమె డిస్‌ క్వాలిఫికేషన్‌కు కారణం అయ్యింది.మంగళవారం బౌట్‌కు ముందు తీసుకున్న ఆహారం.మూడు వరుస బౌట్ల కారణంగా బరువు పెంచి ఉండదని న్యూట్రిషనిస్ట్ భావించారు.నీళ్లు ఎక్కువగా తాగించారు.అదే ఆమె గోల్డ్ మెడల్ మ్యాచ్ కోల్పోయేలాగా చేసింది.52 కిలోల ఉన్న ఆమెను బరువు తగ్గించడానికి కఠినమైన ఎక్సర్సైజులు చేయించడం వల్ల ఆమె ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నది.తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పరిస్థితి మళ్ళీ నార్మల్ అయింది.మొత్తం మీద డైటీషియన్ కమ్ న్యూట్రిషనిస్ట్ వల్ల ఇండియా ఒక మెడల్ కోల్పోయింది అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube