సమ్మర్ లో వేధించే సన్ స్ట్రోక్,‌ డీహైడ్రేషన్ సమస్యలకు మామిడి కాయలతో చెక్ పెట్టొచ్చ‌ని తెలుసా?

ప్రస్తుత వేసవి కాలం( Summer Season )లో మామిడి పండ్లు విరివిరిగా లభ్యమవుతుంటాయి.ఎక్కడ చూసినా నోరూరించే మామిడి పండ్లు దర్శనమిస్తుంటాయి.

 Raw Mangoes Help To Protect From Sunstroke And Dehydration In Summer!,raw Mangoe-TeluguStop.com

ఇక పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందరూ మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు.రుచితో పాటు మామిడి పండ్లలో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.

అయితే మామిడి పండ్లు మాత్రమే కాదు మామిడి కాయలతో కూడా అనేక లాభాలు పొందొచ్చు.అందులోనూ మామిడి కాయలను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే వేసవిలో అత్యధికంగా వేధించే డీహైడ్రేషన్( Dehydration ).

వడ దెబ్బ స‌మ‌స్య‌ల‌కు సుల‌భంగా చెక్ పెట్ట‌వ‌చ్చు.

Telugu Tips, Latest, Raw Mangoes, Rawmangoes, Sunstroke-Latest News - Telugu

ముందుగా ఒక మామిడి కాయ( Mango )ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పీల్ తొల‌గించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, ఒక రెబ్బ కరివేపాకు, ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పుదీనా ఆకులు( Mint Leaves ), హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక కప్పు పెరుగు, రెండు గ్లాసుల వాటర్ వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా అదిరిపోయే సమ్మర్ మ్యాంగో రిఫ్రెషింగ్ డ్రింక్ సిద్ధమవుతోంది.వేసవికాలంలో రోజుకి ఒక్కసారి ఈ డ్రింక్ ను తీసుకుంటే బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.

డీహైడ్రేషన్, వడదెబ్బ వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.నీరసం అలసట వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

Telugu Tips, Latest, Raw Mangoes, Rawmangoes, Sunstroke-Latest News - Telugu

శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.వేసవి వేడి కారణంగా ఒక్కోసారి తీవ్రమైన తలనొప్పి( Headache ) వస్తుంది.అలాంటి సమయంలో మామిడి కాయతో ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ ను తయారు చేసుకునే తీసుకుంటే క్షణాల్లో ఉపశమనం లభిస్తుంది.అంతేకాదు ఈ డ్రింక్ ను వేసవిలో తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే రిస్క్‌ తగ్గుతుంది.

రక్తపోటు అదుపులో ఉంటుంది.ఇమ్యూనిటీ సిస్టం సైతం బూస్ట్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube