''ది ఇండియా హౌస్''గా చరణ్, నిఖిల్ భారీ ప్రాజెక్ట్.. అఫిషియల్!

గ్లోబల్ వైడ్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan) ఇప్పుడు ఎవరికీ అందకుండా విభిన్నంగా ముందుకు వెళ్తున్నాడు.ఒకవైపు భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తూనే మరో వైపు నిర్మాతగా మారి అడుగులు వేస్తున్నారు.

 Ram Charans V Mega Pictures Unveils Historic Debut Details, The India House, Ram-TeluguStop.com

మరి ఇప్పటికే చరణ్ కు నిర్మాత సంస్థ ఉంది.అయిన కూడా ఈయన యూవీ క్రియేషన్స్ నిర్మాత విక్రమ్ రెడ్డితో కలిసి తాజాగా కొత్త ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసాడు.

వీరు సంయుక్తంగా స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ ‘వి మెగా పిక్చర్స్’ (V Mega Pictures) నుండి ఈ రోజు తమ ఫస్ట్ సినిమాను అనౌన్స్ చేసారు.బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తామని ముందుగానే తెలిపారు.ఈ క్రమంలోనే వీరు చెప్పినట్టుగానే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.కొద్దిసేపటి క్రితమే ఈ సాలిడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగా ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయ్యింది.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వీరి ఫస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు.ఈ సినిమాను నూతన డైరెక్టర్ రామ్ వంశీ కృష్ణ తెరకెక్కిస్తుండగా నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు.ఈ రోజు ఈ సినిమా టైటిల్ తో పాటు చిన్న వీడియోను కూడా రిలీజ్ చేయగా అది అందరిని ఆకట్టు కుంటుంది.1900 దశకంలో భారతదేశ చరిత్రలో లేని ఒక అధ్యయనాన్ని ఈ సినిమాతో చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది.

మరి ఇది కూడా మంచి కంటెంట్ తో ఇంట్రెస్టింగ్ గా తీయబోతుండగా.టైటిల్ ను కూడా ఇంట్రెస్టింగ్ గానే పెట్టారు.”ది ఇండియా హౌస్” (The India House) పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించ బోతున్నారు.మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

అతి త్వరలోనే షూట్ స్టార్ట్ కానున్న ఈ సినిమాతో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ (Abhishek Agarwal Arts) కూడా కొలాబరేట్ అయ్యారు.చూడాలి రామ్ చరణ్ ఈ డిఫరెంట్ సినిమాతో నిర్మాతగా లాభాలను అందుకుంటాడో లేదో.

https://youtu.be/SXYiMFTGcS8
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube