కోయంబత్తూరులో పక్షి రాజా(Paksi raja) అనే స్టూడియో ఉండేది దానికి అధినేత ఎస్ఎం శ్రీరాములు నాయుడు(SM Sriramulu Naidu).పక్షి రాజా బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఆయన సినిమాలను నిర్మించేవారు వీరి తొలి చిత్రం బీదల పాటలు ఈ సినిమాకు నాగయ్య(Nagaya) హీరోగా నటించారు.
ఈ బ్యానర్ పై ఎన్టీఆర్ తొలిసారి రాముడు(NTR, Ramudu) అనే టైటిల్ తో సినిమాలు తీయడం మొదలుపెట్టారు అగ్గి రాముడు తోటరాముడు అంటూ ఎన్నో చిత్రాలు వచ్చినప్పటికీ అగ్గి రాముడు చిత్రం తోనే రాముడు అనే టైటిల్ ఆయన వాడటం మొదలుపెట్టారు.నిజానికి అగ్గి రాముడు సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇది ఎన్టీఆర్ కి 20వ చిత్రం కాగా, మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ అల్లూరి సీతారామ రాజు(NTR ,Alluri Sitarama Raju పాత్రలో కనిపించారు.

ఇక ఎన్టీఆర్, భానుమతి(NTR, Bhanumathi) కలిసి నటించిన మూడవ చిత్రం ఇది.రోప్ వే అనే కారును తొలిసారిగా ఈ చిత్రంలో ద్వారానే ఉపయోగించారు.పతాక సన్నివేశాల్లో చిత్రీకరించిన రోప్ వే కార్ చేసింది ఆనాటి ప్రేక్షకులను విశేషంగా అలరించింది.బుర్ర కథ చెప్పడంలో ప్రసిద్ధి పొందిన నాజర్ ధలం పై ఈ చిత్రంలో చిత్రీకరించిన అల్లూరి సీతారామరాజు బుర్రకథ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా ఆరు భాషల్లో నిర్మించబడటం విశేషం మొదటి తమిళంలో ఎంజీఆర్(Mgr)హీరోగా మలైకళ్లను చిత్రాన్ని నిర్మించారు.తర్వాత తెలుగులో అగ్గి రాముడు పేరుతో తీశారు.ఆ తర్వాత దిలీప్ కుమార్ హీరోగా హిందీలో ఆజాద్ పేరుతో నిర్మించారు.అనంతరం కన్నడలో బెట్టెద కళ్ల పేరుతో తీయగా మలయాళం లో తస్కరవీర, సింహల భాషలో శూరసేన పేరుతో ఇదే కథను తీశారు.

ఇన్ని భాషల్లో దొరికేక్కిన ఈ సినిమాకు శ్రీరాముడు నాయుడు మాత్రమే దర్శకుడుగా పని చేయడం విశేషం.1954 ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం ఏడు కేంద్రాల్లో శత దినోత్సవం రెండు కేంద్రాలు రజతోత్సవం జరుపుకుంది అగ్గి రాముడు సినిమా అన్ని భాషల్లోనూ విజయం సాధించడం విశేషం.ఈ సినిమా తర్వాతనే రాముడు అనే పేరుతో ఎన్నో చిత్రాలు వచ్చాయి.







