తలనొప్పి.దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు.
అయితే తల నొప్పి రాగానే దాదాపు అందరూ మొట్ట మొదట చేసేది ఏంటంటే.పెయిన్ కిల్లర్‌ను వేసుకోవడం.
కానీ, పెయిన్ కిల్లర్ కంటే వేగంగా, శరీరానికి ఎటువంటి హానీ కలిగించకుండా తల నొప్పి తగ్గించడంలో గులాబీ పువ్వులు ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.అవును, మీరు విన్నది నిజమే.
తల నొప్పిని ఈజీగా నివారించడంలోనూ గులాబీ పువ్వులు సహాయపడతాయి.మరి లేటెందుకు వాటిని ఎలా వాడితే తల నొప్పి దూరం అవుతుందో చూసేయండి.
తల నొప్పి తీవ్రంగా బాధిస్తున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్‌తో గుప్పెడు గులాబీ పూల రేకులు, ఒక స్పూన్ సోంపు వేసి బాగా మరిగించాలి.ఆపై వాటర్‌ను ఫిల్టర్ చేసుకుని సేవించాలి.
ఇలా చేస్తే తల నొప్పి తగ్గడమే కాదు.ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు సైతం పరార్ అవుతాయి.
అలాగే గులాబీ పువ్వులను ఉపయోగించి మరో విధంగా కూడా తల నొప్పిని తగ్గించుకోవచ్చు.ఎలాగంటే అర కప్పు వెనిగర్ లో గులాబీ రేకులు వేసి అర గంట పాటు నాన బెట్టుకోవాలి.
ఆ తర్వాత వడపోస్తే రోజ్ వెనిగర్ తయారవుతుంది.ఇప్పుడు ఈ రోజ్ వెనిగర్ లో ఒక కాటన్ క్లాత్‌ను ముంచి నుదిటి మీద పెట్టుకుంటే కొన్ని క్షణాల్లోనే తల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇక గులాబీ పువ్వులు తల నొప్పిని తగ్గించడమే కాదు.మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి.ముఖ్యంగా గులాబీ రేకులను ఒక కప్పు నీళ్లలో వేసి మరిగించి తేనె మరియు నిమ్మ రసం కలుపుకుని సేవిస్తే.చర్మం నిగారింపుగా మారుతుంది.జుట్టు రాలడం తగ్గు ముఖం పడుతుంది.నిద్ర బాగా పడుతుంది.
వెయిట్ లాస్ అవుతారు.మరియు జ్ఞాపక శక్తి పెరుగుతుంది.