లబ్దిదారుల రుణాలలో జాప్యం చూపొద్దు:కలెక్టర్

సూర్యాపేట జిల్లా: జిల్లాలో వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులు చేసుకున్న బ్యాంక్ రుణాలను అర్హత మేరకు బ్యాంక్,జిల్లా అధికారులు సత్వరమే పరిష్కరించి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు.

 Do Not Delay In Beneficiary Loans: Collector-TeluguStop.com

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంక్ అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మూడో త్రైమాసికంలో 85 శాతం వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు అందించామని అన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బ్యాంకర్లకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు.రుణ మంజూరులో బ్యాంక్,జిల్లా అధికారులు లబ్దిదారులకు ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని స్పష్టం చేశారు.

రైతుల వ్యవసాయ పరికరాలకు సంబంధించిన రుణపరిమితి తక్కువగా ఉన్నందున ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఆదిశగా రుణాల మంజూరులో ఇబ్బందులు ఉండరాదని చెప్పారు.ప్రభుత్వం నుంచి వివిధ శాఖల ద్వారా రైతులకు,నిరుద్యోగుల యువతకు రాయితీ నిధులు విడుదల చేసిన వెంటనే రుణాలు మంజూరు చేసి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు.2021-22 ఆర్ధిక సంవత్సరంలో మూడో త్రైమాసికంలో ఖరీఫ్ లోని టార్గెట్ 1935.57 కోట్లు పంట రుణ లక్ష్యం కాగా,రూ.1380.17 కోట్లతో ఇప్పటి వరకు వివిధ రకాలపంట రుణాలు అందించామని తెలిపారు.అలాగే వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.850.68 కోట్లు లక్ష్యం కాగా,రూ.318.9 కోట్లతో టర్మ్ రుణాలు అందించామన్నారు.చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు రూ.381.18 కోట్లు లక్ష్యం కాగా,రూ.310.22 కోట్లతో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు అందించామని, అలాగే విద్యా రుణాలకు రూ.71.99 కోట్లు లక్ష్యం కాగా,ఇప్పటి వరకు రూ.66.46 కోట్లతో వివిధ రకాల విద్యా రుణాలు అందించామని తెలిపారు.గృహ రుణాలకు రూ.98.98 కోట్లు లక్ష్యం కాగా, రూ.186.50 కోట్ల రుణాలు అందించడం జరిగిందని చెప్పారు.అలాగే స్వయం సహాయ సంఘాలకు రూ.408.09 కోట్లు లక్ష్యం కాగా,రూ.523.48 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగిందని,అలాగే అధర్ ప్రయారిటీ సెక్టర్ లో రూ.102.62 కోట్లు లక్ష్యం కాగా,రూ.158.31 కోట్ల రుణాలు అందించామని, అదేవిధంగా ఇతర వ్యాపార రుణాల కొరకు రూ.298.56 కోట్లు లక్ష్యం కాగా,576.14 కోట్లతో వివిధ రకాల రుణాలు లబ్దిదారులకు అందించామని కలెక్టర్ తెలిపారు.రుణాలు తీసుకొని చెల్లించని మొండి బకాయిలను రాబట్టేందుకు అనుబంధ శాఖా అధికారులు బ్యాంక్ అధికారులకు సహకరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎల్.డి.ఎం.జగదీష్ చంద్రబోస్,ఆర్.బి.ఐ తేజాదీప్తి,ఏ.జి.ఎం.సత్యనారాయణ,డి.ఏ.ఓ రామారావు నాయక్, జి.ఎం.పరిశ్రమలు తిరుపతయ్య,సంక్షేమ అధికారులు శంకర్,శిరీష,అనసూర్య,దయానంద రాణి,జిల్లా పశు సంవర్ధక అధికారి శ్రీనివాస్,వివిధ శాఖల అధికారులు,బ్యాంక్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube