ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున అందరి ఆసక్తి ఏపీ ఎన్నికల( Ap Elections ) ఫలితాలపై ఉండే అయితే ఈసారి వైసీపీ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తూ ఉండగా మరోవైపు జనసేన, బీజేపీ, టిడిపి కూటమిగా ఎన్నికలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా పిఠాపురం( Pitapuram ) నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.
గత ఎన్నికలలో భాగంగా ఈయన గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ విజయం అందుకోలేకపోయారు.

ఇకపోతే ఈసారి జరగబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు.ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీకి సిద్ధమయ్యారు.అయితే పిఠాపురం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన వైసిపి నేత వంగా గీత( Vanga Geetha ) కూడా పోటీ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పిఠాపురంలో భారీ స్థాయిలో పోటీ నెలకొంది అయితే పవన్ కళ్యాణ్ కి ఈసారి కూడా కాస్త ఓటమి భయం పట్టుకుందని పలువురు పలువురు భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు పిఠాపురంలో ఈసారి కూడా ఓడిపోతానని భయం తనలో ఎక్కడో ఉందని అందుకే పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలను, సీరియల్ ఆర్టిస్టులను అలాగే జబర్దస్త్ కమెడియన్లను కూడా ప్రచార కార్యక్రమాలకు తీసుకువచ్చారంటూ కామెంట్ కు చేస్తున్నారు.ఇప్పటికే జనసేన పార్టీ తరఫున హైపర్ ఆది గెటప్ శీను ఆటో రాంప్రసాద్ వంటి వారు మాత్రమే కాకుండా సీరియల్ సెలబ్రెటీలు కూడా పిఠాపురంలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక వీరు మాత్రమే కాకుండా సినీ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varuntej ) కూడా శనివారం పిఠాపురంలో పర్యటించిన సంగతి మనకు తెలిసిందే.
మరి పిఠాపురంలో ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతారు అక్కడ ఎవరు విజయ్ కేతనం ఎగురవేస్తారు అనేది తెలియాల్సి ఉంది.







