ఆక్రమించుకోవడం ఏంటి.. ఆమేమైనా చిన్నపిల్లనా.. అనసూయ పై రష్మీ కామెంట్స్!

బుల్లితెర యాంకర్లుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో అనసూయ( Anasuya ) రష్మీ( Rashmi ) పేర్లు ముందు వరుసలో ఉంటాయి.వీరిద్దరూ జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరించారు.

 Rashmi Sensational Comments About Anchor Anasuya Details, Anasuya,rashmi, Jabard-TeluguStop.com

జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకోగా రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగారు.అయితే జబర్దస్త్ కార్యక్రమానికి ముందుగా అనసూయ యాంకర్ గా వ్యవహరించగా అనంతరం కొన్ని కారణాలవల్ల రష్మీ యాంకర్ గా వచ్చారు.

ఇలా రష్మీ యాంకర్ గా రావడంతో చాలామంది ఈమెపై విమర్శలు చేశారు.ఉద్దేశపూర్వకంగానే అనసూయను తప్పించి రష్మీ వచ్చారని రష్మీ పట్ల చాలా ట్రోల్స్ వచ్చాయి అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రష్మికి ఈ సంఘటన గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.అప్పట్లో నాకు సంబంధం లేని విషయం మీద నన్ను ట్రోల్ ( Trolls ) చేశారు.ఏం జరుగుతుందో కూడా అర్థం కాకపోవడంతో సైలెంట్ గా ఉన్నా, నన్ను అప్పట్లో దారుణంగా తిట్టారని ఆమె చెప్పుకొచ్చింది.

అనసూయ ప్లేస్ మీరు ఎందుకు ఆక్రమించారనే ప్రశ్న ఈమెకు ఎదురయింది.

ఈ ప్రశ్నకు రష్మి సమాధానం చెబుతూ.ఆక్రమించుకోవడం ఏంటి లాగేసుకున్నానంటూ సమాధానం ఇచ్చింది.మరోసారి యాంకర్ అనసూయ పక్కకి పంపి నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే అనసూయ చిన్నపిల్లా ఏంటి? పక్కకు పంపడానికి అంటూ రష్మీ సమాధానం ఇచ్చింది.అయితే ఈ విషయం గురించి రష్మీ ఇలాంటి కామెంట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది కానీ అనసూయను పక్కకు పంపి రష్మీ ఆ స్థానానికి రాలేదని అనసూయ తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు బ్రేక్ ఇవ్వడంతోనే ఆ కార్యక్రమానికి యాంకర్ గా రష్మీ వ్యవహరించారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube