సీనియర్ స్టార్ హీరోయిన్ ఆమని( Aamani ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆమని ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నా మంచి పాత్రలనే ఎంచుకుంటున్నారు.
భర్తతో విడాకుల గురించి( Aamani Divorce ) ఆమని క్లారిటీ ఇవ్వగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.భర్త అప్పుల పాలు కావడం వల్లే విడిపోయామని జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆమని కామెంట్లు చేశారు.
నా భర్తకు సంబంధించిన అప్పులు అన్నీ తీరిపోయానని ఆ అప్పుకు సంబంధించిన సమస్య అస్సలు లేదని ఆమని పేర్కొన్నారు.నాకు సినిమాలంటే ఇష్టమని నా భర్త బిజినెస్ లో బిజీగా ఉన్నారని ఆమని వెల్లడించారు.
ఒకరికొకరం టైమ్ ఇచ్చుకోవడం కష్టం అని భావించి మేము విడిపోయామని అంతకుమించి విడిపోవడానికి ప్రత్యేకమైన కారణం లేదని ఆమని పేర్కొన్నారు.

విడిపోయినా నా భర్తతో నేను ఇప్పటికీ టచ్ లోనే ఉన్నానని ఆమని వెల్లడించారు.పిల్లల బాధ్యతలను నేనే తీసుకున్నానని పిల్లలే నా ప్రపంచంగా బ్రతుకుతున్నానని ఆమె వెల్లడించడం గమనార్హం.సినిమా షూటింగ్స్ వల్ల పేరెంటింగ్( Parenting ) వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందని కానీ నేను మ్యానేజ్ చేస్తున్నానని ఆమని వెల్లడించడం గమనార్హం.
ఆమని చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆమని రెమ్యునరేషన్( Aamani Remuneration ) ఒకింత పరిమితంగానే ఉందని తెలుస్తోంది.ఆమని వయస్సు 50 సంవత్సరాలు కాగా ఇప్పటికీ ఆమె తక్కువ వయస్సు ఉన్న మహిళలా కనిపిస్తున్నారు.ఆమని కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఆమనిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఆమని సెకండ్ ఇన్నింగ్స్ లో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఆమె కెరీర్ కు ఢోకా ఉండదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇతర భాషల్లో సైతం ఆమని నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.