Constipation : నిత్యం భోజ‌నానికి ముందు ఇలా చేశారంటే మలబద్ధకం అన్న మాటే అనరు!

మలబద్ధకం( Constipation ) వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది కామన్ గా ఫేస్ చేసే జీర్ణ సమస్యల్లో ఇది ఒకటి.అయితే ఎక్కువ శాతం మంది మలబద్ధకాన్ని బయటకు చెప్పుకోలేని సమస్యగా భావిస్తుంటారు.

 Constipation Goes Away By Consuming Buttermilk Like This Before Meals-TeluguStop.com

ఇత‌రుల‌తో ఈ సమస్య గురించి చర్చించేందుకు మక్కువ చూపరు.అయితే మలబద్ధకం తలెత్తడానికి కారణాలు అనేకం.

ఈ సమస్యను వదిలించుకోవడానికి మందులే వాడాల్సిన అవసరం లేదు.కొన్ని ఇంటి చిట్కాలు కూడా మలబద్ధకం సమస్యకు సమర్థవంతంగా చెక్ పెట్టగలవు.

ఈ నేపథ్యంలోనే మలబద్ధకాన్ని నివారించే ఒక బెస్ట్ హోమ్ రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మజ్జిగ( buttermilk ) మనం నిత్యం తాగే పానీయాల్లో ఒకటి.ముఖ్యంగా భోజనం తర్వాత మజ్జిగ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది.అయితే మజ్జిగ నేరుగా కాకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకున్నారంటే మలబద్ధకం అన్న మాట అనరు.

Telugu Buttermilkbee, Tips, Latest-Telugu Health

అందుకోసం ముందుగా ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవాలి.అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు( onion slices ) వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి( Cumin powder ), పావు టేబుల్ స్పూన్ వాము పొడి, చిటికెడు మిరియాల పొడి( Pepper powder ) మరియు బ్లాక్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మసాలా మజ్జిగను భోజనం చేయ‌డానికి అర‌గంట ముందు సేవించాలి.

Telugu Buttermilkbee, Tips, Latest-Telugu Health

ప్రతిరోజు ఈ విధంగా చేశారంటే మలబద్ధకం పరార్ అవుతుంది.ఉల్లిపాయ, జీలకర్ర, మిరియాలు మ‌రియు వాము ఇవన్నీ జీర్ణ వ్యవస్థను చురుగ్గా మారుస్తాయి.తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం అయ్యేలా ప్రోత్సహిస్తాయి.మలబద్ధకం సమస్యను తరిమి కొడతాయి.నిత్యం పగటిపూట మజ్జిగను ఈ విధంగా తీసుకున్నారంటే మలబద్ధకం అన్న మాటే అనరు.పైగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి ఇతర జీర్ణ సమస్యలు సైతం వేధించకుండా ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube