తెలుగు ప్రేక్షకులకు నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒకప్పుడు ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును ఏర్పరచుకుంది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.ఆ తర్వాత ఈమె రాజకీయాల్లోకి ( Politics ) కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది.కాగా ఈమె సినిమాలకు సంబంధించిన విషయాలు కంటే ఎక్కువగా కాంట్రవర్సీలకు సంబంధించిన విషయాల్లోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన విషయాలలో, మూవీస్ కి సంబందించిన విషయాల్లో తలదూరుస్తూ కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా ట్వీట్స్ చేస్తూ ఉంటుంది పూనమ్ కౌర్. అందులో భాగంగానే తాజాగా ఈమె సోషల్ మీడియాలో ఒక సంచలన ట్వీట్ చేసింది.ఏపీ( AP ) కాస్త యూపీ( UP ) అయింది అంటూ ఒక ట్వీట్ వేసింది.ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో కాసేపటికే పూనమ్ క్లారిటీ ఇచ్చింది.

మహిళ విషయంలో, మహిళల గురించి మాట్లాడే విషయంలో, మహిళలకు రక్షణ విషయంలో( Women Safety ) ఏపీ అనేది యూపీలా మారిపోయింది అంటూ ఒక ట్వీట్ చేసింది.అయితే ప్రస్తుతం పూనమ్ వేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అటు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి ట్వీట్ చేయడంతో అది కాస్త పెద్ద దుమారం రేపుతోంది.







