ప్రస్తుత కాలంలో కార్లు, ద్విచక్ర వాహనాలు ఉండని ఇల్లు చాలా అరుదు.ప్రతి ఇంట్లో కారు లేదా ద్విచక్ర వాహనం కచ్చితంగా ఉంటుంది.
అయితే కారు కొనగానే సరిపోదు, కారును ( Car ) సరిగా వాడడం కూడా తెలిస్తేనే కారు జీవిత కాలాన్ని పెంచే అవకాశం ఉంటుంది.కారు కొన్నవారు కారును ఎలా మెయింటైన్ చేయాలో కచ్చితంగా తెలుసుకోవాలి.
దీంతో కారు రిపేరు( Car Repairs ) సమస్యలు తగ్గడంతో పాటు కారు జీవితకాలం పెరుగుతుంది.కారు నడిపే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన మెయింటెనెన్స్ టిప్స్ గురించి తెలుసుకుందాం.
కారు టైర్స్ వేర్, స్ప్లిట్, బుల్జెస్, ట్రెడ్ డెప్త్ లీగల్ ట్రెడ్ డెప్త్ మినిమం 1.6 మి.మీ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఒకవేళ శీతాకాలం అయితే 3మి.మీ ఉండేలా చూసుకోవాలి.టైర్ ప్రెజర్ ను( Tyre Pressure ) అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి.
ఇక కారులో బ్రేక్ ఫ్లూయిడ్ లెవెల్ ను తరచూ చెక్ చేస్తూ ఉండాలి.ఈ బ్రేక్ ఫ్లూయిడ్ లెవెల్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నిపుణుల సలహాలు పాటించాలి.
కారు బ్యాటరీ( Car Battery ) టెర్మినల్స్ ఎప్పుడు క్లీన్ గా ఉండాలి.

ఒకవేళ ఎక్కడైనా తుప్పు పడితే వేడి నీటితో శుభ్రం చేయాలి.ఆ తర్వాత పెట్రోలియం జెల్ లేదంటే బ్యాటరీ టెర్మినల్స్ కోసం రూపొందించిన ప్రొడక్ట్స్ అప్లై చేయాలి.కారులో అప్పుడప్పుడు ఇంజిన్ ఆయిల్ లెవెల్( Engine Oil Level ) చెక్ చేయాలి.
ఇది మినిమం, మాక్సిమం మార్క్స్ మధ్య ఉండాలి.ఆయిల్ తక్కువగా ఉంటే ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఉంది.
ఇక కారులో కూలెంట్ లెవెల్ సరిగా లేకపోతే ఇంజన్ వేడెక్కడం లేదంటే గడ్డ కట్టడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

కారు లాంగ్ డ్రైవ్ కి ముందు చెక్ చేయడం తప్పనిసరి.కారు ఎయిర్ కండిషనింగ్ సిస్టం సరిగా పనిచేస్తుందో లేదో చెక్ చేస్తూ ఉండాలి.కారు ఏసీ-సర్వీసింగ్, రీ-గ్యాసింగ్ ఇలాంటివి ప్రొఫెషనల్స్ తోనే మాత్రమే చేయించాలి.
ఇక ప్రతి సంవత్సరం లేదంటే కారు 20 వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత కచ్చితంగా ఇంజన్ హెయిర్ ఫిల్టర్ మార్చాలి.వైపర్ బ్లెడ్స్ లలో ఏవైనా చీలికలు లేదంటే పగులు కనిపిస్తే వాటిని మార్చేయాలి.
కారు డ్రైవర్ ఈ టిప్స్ పాటించడం వల్ల కారు మైలేజ్ పెరగడంతో పాటు ఇంజిన్ పవర్ బాగుంటుంది.దీంతో తరచూ రిపేరు సమస్యలు రాకుండా కారు జీవితకాలం పెరుగుతుంది.