ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఎన్నో సరికొత్త మార్పులు అందుబాటులోకి వస్తు, సంప్రదాయ సాగుకు స్వస్తి చెబుతూ, అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునే మార్గాన్ని చూపించేదే మైక్రో ఇరిగేషన్.కొంతమంది రైతులకు సాగునీటి వాడకంపై సరైన అవగాహన లేదు.
నీటిని అవసరానికి మించి పంటలకు ఉపయోగిస్తున్నారు.నీటిని, పోషకాలను వృధా చేయడమే కాకుండా సారవంతమైన భూములను క్రమంగా చౌడు భూములుగా మారుస్తున్నారు.
రైతులు( Farmers ) పైరు అవసరాన్ని బట్టి నీటి తడులు అందించాలి.
మొక్క వేరు వ్యవస్థకు నేరుగా నీరు అందేటట్లు చూసుకోవాలి.
అప్పుడే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.ఏదైనా ఒక పంటకు సరైన సమయంలో సరైన మోతాదులో, సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందిస్తే దానిని సూక్ష్మసాగు నీటి పద్ధతి ( Micro Irrigation ) అంటారు.
ఈ సూక్ష్మసాగు నీటి పద్ధతిలో రెండు రకాలు ఉన్నాయి.ఒకటి బిందు సేద్య పద్ధతి, మరొకటి తుంపర సేద్య పద్ధతి.
ప్రతిరోజు మొక్కకు కావలసిన నీటిని డ్రిప్ ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద లేదంటే నేల లోపల వేరు వ్యవస్థకు నేరుగా అతి స్వల్ప పరిమాణంలో నీటిని అందించే విధానమే బిందు సేద్య పద్ధతి.
![Telugu Agriculture, Drip, Techniques, Micro, Micro Benefits, Micro Systems, Spri Telugu Agriculture, Drip, Techniques, Micro, Micro Benefits, Micro Systems, Spri](https://telugustop.com/wp-content/uploads/2024/04/Benefits-of-Micro-Irrigation-Systems-in-farming-detailss.jpg)
ఈ పద్ధతి ద్వారా దాదాపుగా 80 నుంచి 90 శాతం నీటి వినియోగంఉంటుంది.డ్రిప్ పద్ధతి( Drip System ) వల్ల ఏకంగా 50% వరకు నీరు ఆదా అవుతుంది.మొక్క వేర్లకు నీరు, పోషకాలు సక్రమంగా అందితే దిగుబడి శాతం పెరిగే అవకాశం ఉంటుంది.
ప్రతి మొక్కకు సమానంగా నీరు అందడం వల్ల విద్యుత్ మోటారు కొంత సమయం మాత్రమే నడుస్తుంది దీంతో కరెంటు కూడా ఆదా అవుతుంది.ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులు అందిస్తే 20% ఎరువులు ఆదా అవుతాయి.
ఇక తుంపర్ల పద్ధతి వల్ల వర్షం వలె మొక్కలపై లేదంటే భూమిపై నీటిని విరజిమ్మటం.
![Telugu Agriculture, Drip, Techniques, Micro, Micro Benefits, Micro Systems, Spri Telugu Agriculture, Drip, Techniques, Micro, Micro Benefits, Micro Systems, Spri](https://telugustop.com/wp-content/uploads/2024/04/Benefits-of-Micro-Irrigation-Systems-in-farming-detailsa.jpg)
ఈ విధంగా సాగు చేస్తే పొలంలో నీటి పారించడం కోసం కాలువలు, గట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు.కొంత భూమి కూడా నష్టం పోకుండా పొలం మొత్తం సాగు చేయవచ్చు.కాలువల ద్వారా నీటిని పారిస్తే దాదాపుగా 30% నీరు వృధా అవుతుంది.
అలాకాకుండా ఈ కొత్త పద్ధతుల వల్ల నీటిని అందించడం వల్ల దాదాపుగా 20% నాణ్యమైన అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.