సూర్యపేట జిల్లా: మఠంపల్లి మండలం అల్లిపురం గ్రామంలో నలుగురు యువకులు గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లగా అందులో ఖమ్మం జిల్లాకు చెందిన అకిరా నందన్ అనే యువకుడు గల్లంతయ్యాడు.మిగతా ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు.
వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా,వైరా మండలం, అంబేద్కర్ నగర్ కు చెందిన వ్యక్తి వేము రాజు కుమారుడు అకిరా నందన్ సూర్యాపేట జిల్లా,మఠంపల్లి మండలం అల్లిపురం గ్రామంలోస్నేహితురాలి వివాహానికి వచ్చాడు.తన ముగ్గురి స్నేహితులతో కలిసి బావిలో ఈతకు వెళ్ళాడు.
ప్రమాదవశాత్తు అకిరా నందన్ బావిలో మునిగి మరణించాడు.అకిరా నందన్ మృతదేహం కోసం గ్రామస్తులు వలలతో గాలిస్తున్నారు.