సోషల్ మీడియాలో వైసీపీ కింగే.. జగన్ కు తిరుగులేని సైన్యం

ఏపీ అధికార పార్టీ వైసీపీకి( YCP ) తిరుగులేని శక్తిగా మారింది ఆ పార్టీ సోషల్ మీడియా సైన్యం.జగన్ పైన,( CM Jagan ) వైసీపీ పైన ఎవరు విమర్శలు చేసినా, ఆ విమర్శలను తిప్పుకొట్టడంతో పాటు , ఆ విమర్శలు చేసిన పార్టీల పైన , గతంలో వారి వ్యవహరించిన తీరు పైన ఆధారాలతో సహా బయటపెట్టి జనాల్లో వారు చులకనయ్యేలా చూడడంలో వైసిపి సోషల్ మీడియా విభాగం కీలక పాత్ర పోషిస్తుంది.2019 ఎన్నికల్లో వైసిపి తిరుగులేని విజయాన్ని సాధించడానికి సోషల్ మీడియా( Social Media ) కూడా ఒక కారణమే.వైసిపి ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే , ఆ పార్టీకి వెన్నుదన్నుగా సోషల్ మీడియా విభాగం పని చేస్తోంది.

 Social Media Turning As Big Strength For Ycp Cm Jagan Details, Ysrcp, Ap Cm Jaga-TeluguStop.com

ప్రస్తుతం 4,500 మంది సోషల్ మీడియా వారియర్లతో తిరుగులేని శక్తిగా వైసిపి ఉంది.

Telugu Ap Cm Jagan, Ap, Sajjala Bhargav, Sajjalabhargav, Ys Jagan, Ysrcp-Politic

వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ, గత టిడిపి పాలనను, ప్రస్తుత వైసిపి పాలనను బేరీజు వేస్తూ జనాల్లో వైసిపి క్రేజీ మరింత పెంచే విధంగా వైసీపీ సోషల్ మీడియా విభాగం సమర్థవంతంగా పనిచేస్తుంది.టిడిపికి అనుకూలంగా ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా చేసే విమర్శలను తిప్పుకొట్టడంలోనూ వైసీపీ సోషల్ మీడియా విభాగం సమర్థవంతంగా పనిచేస్తుంది.వైసిపికి సోషల్ మీడియాలో దాదాపు మిలియన్ ల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఎప్పటికప్పుడు జనాలకు, పార్టీకి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడంలో వైసిపి సోషల్ మీడియా విభాగం కీలకపాత్ర పోషిస్తుంది.

ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియాకు ఇన్చార్జిగా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్( Sajjala Bhargav ) ఉన్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Sajjala Bhargav, Sajjalabhargav, Ys Jagan, Ysrcp-Politic

పార్టీ కోసం స్వచ్ఛందంగా పనిచేసే వ్యక్తులతో భారీ నెట్వర్క్ తమకు ఉందని సజ్జల భార్గవ్ చెబుతున్నారు .మండల , జిల్లా , నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియాకు కమిటీలు ఉన్నాయి .ప్రస్తుతం 4500 మంది సోషల్ మీడియా వారియర్లతో వైసిపి తిరుగులేని శక్తిగా సోషల్ మీడియాలో దూసుకు వెళ్తోంది.యూట్యూబ్, ఇనిస్టిగ్రామ్ , ఫేస్ బుక్ , x తదితర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ప్రస్తుతం వైసీపీ నే అగ్రస్థాయిలో ఫాలోవర్లను కలిగి ఉంది.ఇదే వైసిపికి, జగన్ కు అదనపు బలంగా మారింది.

సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలమైన శక్తిగా ముందుకు తీసుకు వెళ్లే విషయంలో సజ్జల భార్గవ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube