పైసా ఖ‌ర్చు లేకుండా ఇంట్లో ఉండే ఈ రెండిటితో హెయిర్ ఫాల్‌కు చెక్ పెట్టొచ్చు.. తెలుసా..?

జుట్టు రాలడం( Hair Fall ) అనేది అందరిలోనూ ఉండే కామన్ సమస్య.అయితే జుట్టు రాలడానికి అందరిలోనూ ఒకే రకమైన కారణాలు ఉండవు.

 Simple And Effective Mask To Get Rid Of Hair Fall!, Hair Mask, Egg Lemon Mask, H-TeluguStop.com

తలస్నానం సమయంలో చేసే పొరపాట్లు, ఒత్తిడి, జీవన శైలిలో మార్పులు, పోషకాల కొరత, కాలుష్యం తదితర కారణాల వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది.దీంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ సమస్య నుంచి బయటపడేందుకు శ్రమిస్తూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్స‌లు చింతించ‌కండి.పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా సులభంగా హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టవచ్చు.అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా రెండు నిమ్మ పండ్లను తీసుకుని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ ను బ్రేక్‌ చేసి వేసుకోవాలి.అలాగే లెమన్ జ్యూస్( Lemon Juice ) కూడా వేసి రెండు కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Egg Lemon, Care, Care Tips, Fall, Healthy, Lemon, Thick-Telugu Health

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్( Scalp ) తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఇలా చేశారంటే అద్భుత ఫలితాలు పొందుతారు.పోష‌కాల‌కు గుడ్డు( Egg ) ప‌వ‌ర్ హౌస్ లాంటిది.ముఖ్యంగా గుడ్డులో ఉండే విటమిన్ ఎ , విట‌మిన్‌ ఇ, బయోటిన్, ఫోలేట్ వంటి పోషకాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో తోడ్ప‌డుతుంది.గుడ్డు త‌ల‌కు ప‌ట్టించ‌డం వ‌ల్ల‌ జుట్టు కుదుళ్ల‌కు అవసరమైన విటమిన్లు మరియు మినరల్స్ అందుతాయి.

జుట్టు రాల‌డం త‌గ్గి కొత్త వెంట్రుకలు రావ‌డం ప్రారంభం అవుతాయి.గుడ్డులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు డ్రై హెయిర్( Dry Hair ) ను రిపేర్ చేస్తాయి.

కురుల‌కు తేమ‌ను అందించి మెరిసేలా ప్రోత్స‌హిస్తాయి.

Telugu Egg Lemon, Care, Care Tips, Fall, Healthy, Lemon, Thick-Telugu Health

ఇక లెమ‌న్ జ్యూస్ మొండి చుండ్రు( Dandruff )ను తొలగించడానికి అద్భుతంగా తోడ్ప‌డుతుంది.అలాగే ఇది మీ స్కాల్ప్‌ను లోతుగా శుభ్రపరుస్తుంది, హైడ్రేట్ చేస్తుంది, పొరలుగా ఉండే చర్మాన్ని తొలగిస్తుంది, దురదను తగ్గిస్తుంది.మ‌రియు జుట్టు రాల‌డాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంటుంది.

కాబ‌ట్టి, హెయిర్ ఫాల్ తో బాధ‌పడుతున్నవారు ఈ ఎగ్ అండ్ లెమ‌న్ మాస్క్( Egg and Lemon Mask ) ను త‌ప్ప‌క ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube