Amino acids Muscle building : జిమ్ లో కండలు పెంచాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

ప్రస్తుత కాలంలో చాలామంది యువత వారి ఉద్యోగాల వల్ల బిజీబిజీగా ఉన్నారు.దీనివల్ల ఎక్కువగా ఆరోగ్యం పై శ్రద్ధ చూపలేకపోతున్నారు.

 Do You Want To Build Muscle In The Gym But Do This , Health , Hea;th Tips, Amin-TeluguStop.com

ఈ మధ్యకాలంలో యువతలో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉంటుంది.అందుకోసం కొంతమంది యువత మాత్రమే ఉదయం, సాయంత్రం జిమ్ లో వెళ్లి కసరత్తులు చేస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే మంచి ఆరోగ్యానికి వ్యాయామం కచ్చితంగా అవసరం.దీనికి కచ్చితంగా సరైన ఆహారం నియమాలను పాటిస్తే అనారోగ్యాలు దగ్గరికి రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.

అయితే కొంతమంది యువత కండలు పెంచాలని సరైన శరీర ఆకృతి వారికి ఉండాలని ఎంతో కష్టపడి పోతూ ఉంటారు.సాధారణంగా మజిల్స్ సరిగ్గా ఉంటేనే శరీరం అంతా అందంగా కనిపిస్తుంది.

అయితే కండలను బాగా పెంచేందుకు జిమ్ లో చాలా కసరత్తులు చేయాల్సి ఉంటుంది.ఈ కసరత్తులు చేసే సమయంలో మంచి ఆహారంతో పాటు సరైన విశ్రాంతి కూడా అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

ఇలా కండలు పెంచడానికి ఏం చేయాలో దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips-Telugu Health Tips

శరీరం ఎక్కువగా ఆమెనో ఆమ్లాలను ఉపయోగించుకుంటేనే మన శరీరంలోని కండలు పెరుగుతాయి.అందుకే మజిల్ బిల్డింగ్ టార్గెట్గా ఉన్నవారు ఎక్కువగా ఆ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉండడం వల్ల వారి శరీరానికి ఆమైనో యాసిడ్స్ ఎక్కువగా అందిస్తూ ఉండాలి.ముఖ్యంగా వ్యాయామం చేసే సమయంలో శరీరానికి అవసరమైన ప్రోటీన్లను తప్పనిసరిగా తీసుకోవాలి.

కండలు పెంచాలనుకునేవారు ప్రతిరోజు సరైన వ్యాయామాలను ట్రైనర్ సలహాతో చేస్తూ ఉండాలి.జిమ్ లో ఏదో ఒక రోజులోనే కండలు పెంచేయాలి అని వేగంగా ఎక్కువ సేపు వ్యాయామం చేయడం వల్ల లేనిపోని అనారోగ్యాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇంకా చెప్పాలంటే కండలు పెంచి వాటిని సరైన ఆకృతిక మలుచుకోవాలంటే శరీరాన్ని ఎక్కువ కష్టానికి గురి చేయాల్సి ఉంటుంది.ఇలాంటి కష్టతరమైన వ్యాయామాలు చేసేటప్పుడు ప్రతిరోజు కచ్చితంగా ఎనిమిది నుంచి పది గంటలు నిద్ర పోవడం ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube