చాలా మంది కేవలం గ్రీన్ టీ వలనే చాలా ప్రయోజనాలు ఉన్నాయని అనుకుంటారు.కానీ చామంతి టీలో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
చామంతి టీని ముఖానికి రాసుకొని ఆరాక ముఖాన్ని శుభ్రంగా కడగాలి.
చామంతి టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ గ్రంధులలోపలి వరకు చొచ్చుకొని వెళ్ళటం వలన చర్మం తాజాగా ఉంటుంది.
కాలిన గాయాలు,దోమ కాటు వలన వచ్చే దద్దుర్లను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
చామంతి టీని ప్రతి రోజు క్రమం తప్పకుండ రాస్తూ ఉంటే సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.చర్మాన్ని బిగుతుగా చేయటమే కాకుండా మచ్చలను కూడా తగ్గిస్తుంది.
పనిఒత్తిడి,నిద్రలేమి వంటి కారణాలతో కంటి కింద వాపు వస్తుంది.ఇటువంటి సమయంలో చామంతి టీ బ్యాగ్ ఫ్రిజ్ లో పెట్టి మూసిన కనురెప్పలపై ఉంచితే కంటి కింద వాపు మరియు కంటి అలసట కూడా తగ్గుతుంది.
అర కప్పు చామంతి టీలో కప్పున్నర పాలపొడి కలిపి నలుగు పిండిలా వాడితే స్క్రబ్ వలే పనిచేస్తుంది.చర్మంపై పేరుకున్న మృతకణాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది.
పావుకప్పు గోరింటాకు పొడికి సరిపడా చామంతి టీని కలిపి నాలుగు గంటలు అయ్యాక తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానము చేస్తే జుట్టుకు మంచి పోషణ అందుతుంది.