జుట్టు అధికంగా రాలిపోతుందని రోజు అద్దంలో చూసుకుంటూ బాధపడే వారు ఎంతో మంది ఉంటారు.జుట్టు రాలడానికి అందరిలోనూ కారణాలు ఒకేలా ఉండవు.
అయితే రీజన్ ఏదైనా కూడా జుట్టు రాలడాన్ని అరికట్టడానికి మన వంటింట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ చాలా ఉత్తమంగా సహాయ పడతాయి.ఈ జాబితాలో కాఫీ పౌడర్ కూడా ఒకటి.
కాఫీ.ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఫేవరెట్ డ్రింక్.
ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే గాని చాలా మంది తమ రోజు ను ప్రారంభించలేరు.అంతలా కాఫీతో ముడి పడిపోయారు.
కాఫీ యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి పక్కన పెడితే.జుట్టుకు మాత్రం ఇది ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా రెండు స్పూన్ల కాఫీ పౌడర్( Coffee powder ) తో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేశారంటే హెయిర్ ఫాల్ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టుకు కాఫీ పొడిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గుడ్డు పచ్చసొన వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) మరియు రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకొని మూడు పదార్థాలు కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ కాఫీ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.

కాఫీలోని కెఫిన్ కంటెంట్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.మరియు జుట్టు రాలడాన్ని ఆపుతుంది.అలాగే కెఫిన్ జుట్టు కుదుళ్లకు రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది.
జుట్టును దృఢంగా మారుస్తుంది.గుడ్డు పచ్చసొన డ్రై హెయిర్ ను దూరం చేస్తుంది.
జుట్టుకు షైన్‌ను జోడిస్తుంది.గుడ్డులో లుటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.
ఇది జుట్టును బలోపేతం చేయడానికి మరియు ఒత్తుగా పెరిగేందుకు తోడ్పడుతుంది.గుడ్డులోని ప్రోటీన్లు దెబ్బతిన్న కెరాటిన్‌ను నయం చేయడంలో సైతం సహాయపడతాయి.
ఇక పెరుగు మీ జుట్టును తేమగా మరియు మృదువుగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ స్కాల్ప్‌ను శుభ్రపరచడానికి, మృత చర్మ కణాలను క్లియర్ చేయడానికి, హెయిర్ ఫోలికల్స్‌ను శుభ్రపరచడానికి తోడ్పడుతుంది.
కాబట్టి, జుట్టు రాలడం తగ్గు ఒత్తుగా ఆరోగ్యంగా పెరగాలి అనుకుంటే ఈ కాఫీ హెయిర్ మాస్క్ ను తప్పక ట్రై చేయండి.