బడుగు వర్గం, మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మంచి చదువులు చదవడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు.అందులోనూ బతుకు జీవనం కష్టంగా ఉండే పరిస్థితుల నుండి ఉన్నత ఉద్యోగాలను సాధించడం చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యం.
అలా విజయం సాధించిన వారు వెళ్ల మీదనే లెక్కించవచ్చు.ఇక అలాంటి వారికి వారి తల్లిదండ్రులు పడ్డ కష్టం విలువ తెలుసుకో కాబట్టి వారు ఎన్నో కష్టాలను అనుభవించి చివరికి విజయం సాధిస్తారు.
ఇకపోతే తాజాగా ఓ టీ అమ్ముకునే వ్యక్తి( Tea Seller ) కూతురు భారత దేశంలోనే అతి కష్టమైన పరీక్షల్లో ఒకటైన సీఏ( CA Exams ) సంబంధించిన పరీక్షలు ఉత్తీర్ణత సాధించింది.ఈ విషయాన్ని కూతురు పంచుకుంటున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
ఆ అమ్మాయి కుటుంబంలో మొత్తం అందరూ కలిసి కష్టపడితే గాని వారి ప్రతిరోజు మూడు పూటలా తిండి తినలేని పరిస్థితి.అలాంటి కుటుంబంలో పుట్టిన ఆ అమ్మాయి చదివించడానికి చాలా తక్కువ మంది మాత్రమే ముందుకు వచ్చారు.
ఢిల్లీకి చెందిన అమిత ప్రజాపతి( Amita Prajapati ) అనే అమ్మాయికి వారి తల్లిదండ్రులు మాత్రం ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఆ అమ్మాయిని కచ్చితంగా చదివించాలని ఆలోచనతో సపోర్ట్ చేశారు.
తాము సరైన చదువుకోలేక చివరికి టీ బండి నడుపుకుంటూ గడిపే జీవితం తన కూతురికి రాకూడదన్న ఉద్దేశంతో ఆలోచించి ప్రతి రూపాయిని పొదుపుగా పెట్టి అమిత ప్రజాపతిని వారు చదివించారు.వారి అమ్మాయిని ఉన్నతంగా చూడాలని కోరికను తన కూతురు కూడా కాస్త ఆలస్యమైనా సరే చివరికి ఎంతో కష్టపడి సిఏ పూర్తి చేసింది.నిజానికి సిఎ పూర్తి చేయడానికి అమిత ఓ యుద్ధమే చేసింది అని చెప్పవచ్చు.
ఎవరైనా సరే సిఏ నాలుగు లేదా ఐదు సార్లు రాస్తేనే ఇక వాటిని పక్కన పెట్టేస్తారు.
అలాంటిది అమిత మాత్రం తాను పెట్టుకున్న లక్ష్యాన్ని కాస్త ఆలస్యంగా అయినా సరే దాదాపు 10 ఏళ్లపాటు కష్టపడి చదివి చివరికి సీఏను పూర్తి చేసింది.తాజాగా విడుదలైన చార్టెడ్ అకౌంట్ పరీక్ష ఫలితాలలో ఆవిడ ఉత్తీర్ణత సాధించిన విషయాన్ని తన తల్లికి ఆప్యాయంగా కౌగిలించుకొని కన్నీళ్ళతో చెప్పిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టిన వైరల్ అవుతుంది.ఈ సమయంలో ఆమె తండ్రి కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఈ వీడియోని చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.ఇలాంటి కూతురు ప్రతి ఒక్కరికి ఉండాలంటూ అమిత పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.