బాలీవుడ్ నటుడు క్రిటిక్ ఉమైర్ సంధు( Umair Sandhu ) అనే పేరు ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినపడుతోంది ఈయన సోషల్ మీడియా వేదికగా చేసే వివాదాస్పద పోస్టులు కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఈయన వ్యవహార శైలిపై ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు తీవ్ర స్థాయిలో మండిపడటమే కాకుండా ఆయనపై చర్యలు తీసుకోవాలి అంటూ కేసులు కూడా నమోదు చేశారు.
ఇలా తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నటువంటి ఈయన తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) పై ఊహించని కామెంట్లు చేశారు.
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్నారు.ఒకవైపు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న రష్మిక గురించి ఉమైర్ సందు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
తాజాగా రష్మిక గురించి ఈయన పోస్ట్ చేస్తూ రష్మిక గత రెండు నెలల క్రిందట అబార్షన్( Abortion ) చేయించుకుంది అంటూ కామెంట్లు చేశారు.ఈమె విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) కారణంగా ప్రెగ్నెంట్ అయిందని, అయితే ఇటీవల తాను అబార్షన్ చేయించుకుంది అంటూ బాంబు పేల్చారు.ఇలా ఈయన చేసిన ఈ పోస్టుపై రష్మిక విజయ్ దేవరకొండ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.ఈయన చేసిన వ్యాఖ్యలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది కాస్త సంచలనంగా మారింది.
ఇక మరోవైపు రష్మిక విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారు.ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు పరోక్షంగా చెప్పారు కానీ ఇంకా అఫీషియల్ గా ఎక్కడ ప్రకటించలేదు దీంతో వీరిద్దరి గురించి ఉమైర్ సందు ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయటం హాట్ టాపిక్ గా మారింది.