సజ్జలు.వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.చిరుధాన్యాల్లో ఒకటైన సజ్జలు రుచిగా ఉండటమే కాదు.బోలెడన్ని పోషక విలువలను సైతం కలిగి ఉంటాయి.అందుకే సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అయితే సజ్జలే కాదు సజ్జ అటుకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా సజ్జ అటుకులను గనుక తీసుకుంటే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ను తమ సొంతం చేసుకోవచ్చు.మరి లేటెందుకు అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల సజ్జ అటుకులు, ఒక కప్పు కాచి చాల్లార్చిన పాలు వేసుకుని మూత పెట్టి గంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న సజ్జ అటుకులు వేసుకోవాలి.
అలాగే ఒక అరటి పండు, వన్ టేబుల్ స్పూన్ పీనట్ బటర్, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి, వన్ టేబుల్ స్పూన్ హోం మేడ్ ప్రోటీన్ పౌడర్ మరియు ఒక గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రంలో వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న చియా సీడ్స్ మిక్స్ చేసుకుంటే సజ్జ అటుకుల స్మూతీ సిద్ధం అవుతుంది.ఈ టేస్టీ అండ్ హెల్తీ స్మూతీని ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే అతి ఆకలి దూరం అవుతుంది.చిరు తిండ్లపై మనసు మల్లకుండా ఉంటుంది.
దాంతో వెయిట్ లాస్ అవుతారు.
అలాగే సజ్జ అటుకుల స్మూతీని డైట్‌లో చేర్చుకుంటే నీరసం, అలసట దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
రోజంతా ఎంతో యాక్టివ్‌గా ఉంటారు.జీర్ణ వ్యవస్థ చురుగ్గా పని చేస్తుంది.
ఎముకలు, కండరాలు బలంగా మరియు దృఢంగా తయారవుతాయి.అధిక రక్తపోటును అదుపు చేయడంలోనూ ఈ స్మూతీ అద్భుతంగా సహాయపడుతుంది.







