అరెరే.. నోట్ల కట్టలను ఇలా కూడా లెక్కిస్తారా..? (వీడియో)

సాధారణంగా డబ్బు లెక్కించడం( Counting Money ) అంటే మనం చాలా జాగ్రత్తగా చేసుకునే పని.ఒకసారి కౌంట్ చేసినా, మరోసారి సరిచూసుకోవడం అనేది చాలా మందికి అలవాటు.

 Counting Money By Weight Video Viral Details, Money Counting Methods, Viral Vide-TeluguStop.com

కానీ, ఇప్పుడు కౌంటింగ్ మెషిన్‌లు( Counting Machine ) అందుబాటులోకి రావడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు వేగంగా లెక్కించగలుగుతున్నారు.అయితే, ఆ మెషిన్‌లు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు.

ఎక్కువగా బ్యాంకులు, పెద్ద వ్యాపార సంస్థలలోనే వీటిని ఉపయోగిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి డబ్బు లెక్కించడానికి ఒక వినూత్నమైన విధానాన్ని ఎంచుకున్నాడు.

ఆ విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ప్రకారం, ఒక వ్యక్తి సంచిలో డబ్బు కట్టలను తీసుకొచ్చి టేబుల్‌పై పెడతాడు.ఆ తరువాత వాటిని టేబుల్‌పై ఉన్న వెయింగ్ మెషిన్‌పై( Weighing Machine ) ఉంచి బరువును చూసి లెక్క పెట్టడం మొదలుపెడతాడు.వీడియోలో చూపినట్టుగా, రూ.500 నోట్ల కట్ట బరువు కచ్చితంగా 95 గ్రాములు చూపిస్తోంది.దీంతో ఆ వ్యక్తి ప్రతి కట్టను తన లెక్క ప్రకారం సరిగ్గా ఉందని భావించి తీసుకుంటున్నాడు.

ఆ వ్యక్తి వినూత్నమైన ఈ లెక్కింపు పద్ధతి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను వివిధ రకాలుగా కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.కొందరు ఈ పద్ధతిని అద్భుతంగా పేర్కొనగా, మరికొందరు నమ్మదగిన పద్ధతిగా భావించలేదు.ఇందులో కొందరు ఏంటి బరువు ఆధారంగా కూడా డబ్బులు లెక్కించవచ్చా? అని కామెంట్ చేస్తుండగా మరికొందరేమో.ఈ పద్ధతి పూర్తిగా నమ్మదగినదేమో అనిపించడం లేదని కామెంట్ చేస్తున్నారు.ఏదిఏమైనా ఈ కొత్త పద్ధతి మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.ఈ విధానం డబ్బులు లెక్కింపు పనిని వేగవంతం చేస్తుంది.అయితే, ఇది కేవలం నోట్ల కట్టల బరువులో ఏ మాత్రం తేడా లేకుండా ఉండే సందర్భాల్లోనే బాగా పనిచేస్తుంది.

ఏదేమైనప్పటికీ, డబ్బు లెక్కింపులో వినూత్న ఆలోచనలకు ఇది ఒక నిదర్శనం.బరువు ఆధారంగా డబ్బు లెక్కించే ఈ పద్ధతి మనలో కొందరికి కొత్త ఆలోచనలకు ప్రేరణగా మారవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube