యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిగా ఎన్నిక .. భగవద్గీతపై సుహాస్ సుబ్రహ్మణ్యం ప్రమాణం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయులు(Indian) అక్కడ కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ఇదే సమయంలో మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలను సైతం ఖండాలు దాటిస్తున్నారు.

 Indian Origin Congressman Suhas Subramanyam Takes Oath On Bhagvad Gita, Suhas S-TeluguStop.com

ఇప్పుడు ప్రతి దేశంలోనూ హిందూ ఆలయాలు , గురుద్వారాలు(Hindu temples ,gurudwaras) వెలుస్తున్నాయంటే దానికి కారణం భారతీయులే.మన అన్ని పండుగలు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు భారతదేశంలో ఏ రోజు జరుగుతున్నాయో అదే రోజు, అదే సమయానికి ఇతర దేశాల్లోనూనిర్వహిస్తున్నారు.

తాజాగా భారతీయ సంస్కృతి, హిందూ మతంపై (Indian culture ,Hinduism)అభిమానం చాటుకున్నారు భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్(US Congress) సభ్యుడు సుహాస్ సుబ్రహ్మణ్యం( Suhas Subramanyam).అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన ఆయన హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతపై ప్రమాణం చేసి కాంగ్రెస్ సభ్యుడిగా తన బాధ్యతలను స్వీకరించారు.కుమారుడి ప్రమాణ స్వీకారాన్ని సుహాస్ తల్లి స్వయంగా వీక్షించారు.అయితే అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడిగా భగవద్గీతపై (Bhagvad Gita)ప్రమాణ స్వీకారం చేసిన తొలి హిందూ అమెరికన్‌ తులసి గబ్బార్డ్ నిలిచారు.

ఆమె 2013లో యూఎస్ కాంగ్రెస్‌లో అడుగుపెట్టిన సమయంలో భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేశారు.

Telugu Bhagvad Gita, Hinduism, Indian, Ndianorigin-Telugu Top Posts

గతేడాది నవంబర్‌లో జరిగిన యూఎస్ ఫెడరల్ ఎన్నికల్లో వర్జీనియాలోని 10వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన విజయం సాధించారు.అంతేకాదు.అమెరికా తూర్పు తీర ప్రాంతం నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారత సంతతి నేతగా సుహాస్ చరిత్ర సృష్టించారు.

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సుబ్రహ్మణ్యం .అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సాంకేతిక సలహాదారుగా సైబర్ భద్రత, ప్రభుత్వ ఏజెన్సీలను ఆధునీకరించడంలో సేవలందించారు.సుహాస్.2019లో, గతేడాదిలోనూ వర్జీనియా జనరల్ అసెంబ్లీకి, స్టేట్ సెనేట్‌కు ఎన్నికయ్యారు.వాలంటరీ వైద్యుడిగా, ఫైర్‌ఫైటర్‌గానూ సేవలందిస్తున్నారు.

Telugu Bhagvad Gita, Hinduism, Indian, Ndianorigin-Telugu Top Posts

కాగా.గతేడాది జరిగిన ఎన్నికల్లో సుహాస్‌ సుబ్రహ్మణ్యంతో కలిసి ఆరుగురు వ్యక్తులు యూఎస్ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.అమెరికాలో భారతీయులు ఈ స్థాయిలో ఆ దేశ పార్లమెంట్‌కు ఎన్నికవ్వడం ఇదే తొలిసారి.

సుహాస్ కాకుండా మిగిలిన భారత సంతతి కాంగ్రెస్ సభ్యులు అమీ బేరా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, శ్రీథానేదర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube