కురులకు అండగా కరివేపాకు.. ఇలా వాడితే మస్తు లాభాలు!

కరివేపాకు( curry leaves ) గురించి పరిచయాలు అక్కర్లేదు.దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కరివేపాకుని విరివిగా ఉపయోగిస్తారు.

 Here The Benefits Of Curry Leaves For Hair! Hair Care, Hair Care Tips, Healthy H-TeluguStop.com

రోజువారి కూరల్లో కచ్చితంగా కరివేపాకు పడాల్సిందే.ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను అందించే కరివేపాకు.

కురుల సంరక్షణకు సైతం అండగా ఉంటుంది.ముఖ్యంగా కరివేపాకును ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మస్తు లాభాలు పొందుతారు.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ కరివేపాకు, అరకప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో చూసి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.

ఈ కరివేపాకు జ్యూస్ లో వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( vitamin E oil ), వన్ టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ( Almond oil )వేసి బాగా మిక్స్ చేస్తే మంచి హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.ఒక స్ప్రే బాటిల్ లో ఈ టానిక్ ను నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Curry, Curry Benefits, Curry Tonic, Care Tips, Healthy, Benefitscurry, La

వారానికి ఒక్కసారి ఈ విధంగా చేస్తే చాలా బెనిఫిట్స్ పొందుతారు.కరివేపాకు జుట్టుకు అవసరమైన ఖనిజాలు, విటమిన్లు మరియు ప్రోటీన్లు అందిస్తుంది.జుట్టు పెరుగుదల‌ను ప్రోత్స‌హిస్తుంది.

కరివేపాకులో ఉండే విటమిన్ బి మరియు కాల్షియం జుట్టు రాలిపోవడాన్ని నియంత్రిస్తాయి.యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ( Antifungal and antibacterial )గుణాలను కలిగి ఉండ‌టం వ‌ల్ల స్కాల్ప్‌ ఇన్ఫెక్షన్లను నివారించడంలో క‌రివేపాకు సహాయపడుతుంది.

Telugu Curry, Curry Benefits, Curry Tonic, Care Tips, Healthy, Benefitscurry, La

ఇటీవ‌ల కాలంలో చాలా మంది చిన్న వ‌య‌సులోనే తెల్ల జుట్టు స‌మ‌స్య‌ను ఫేస్ చేస్తున్నారు.అయితే కరివేపాకులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు త్వ‌ర‌గా నెరసిపోకుండా నిరోధిస్తాయి.వ‌య‌సు పైబ‌డిన జుట్టు న‌ల్ల‌గా మెరిసేలా ప్రోత్స‌హిస్తాయి.అంతేకాదండోయ్‌.వారానికి ఒక‌సారి క‌రివేపాకును పైన చెప్పిన విధంగా కురుల‌కు ఉప‌యోగిస్తే.హెయిర్ రూట్స్ స్ట్రోంగ్ గా మార‌తాయి.

చుండ్రు స‌మ‌స్య దూరం అవుతుంది.జుట్టు రాల‌డం త‌గ్గి ఒత్తుగా, పొడుగ్గా పెర‌గ‌డం ప్రారంభ‌మ‌వుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube