బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శ్రీముఖి( Sreemukhi ) ఒకరు.ఇటీవల కాలంలో బుల్లితెరపై పెద్ద ఎత్తున సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఇలా శ్రీముఖి ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే.ఈమె వెంకటేష్( Venkatesh ) హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రామలక్ష్మణుల( Rama Lakshmana ) గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో వివాదానికి కారణమయ్యాయి.ఇంతకీ ఈ వేడుకలో ఏం జరిగిందనే విషయానికి వస్తే…
నిర్మాతలు దిల్ రాజు( Dil Raju ) శిరీష్‌ను పొగిడే క్రమంలో.రామ, లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్(ఊహజనిత పాత్రలు) అని విన్నాము కానీ నేడు కళ్ళముందు సాక్షాత్తు ఇక్కడ కూర్చున్నారు.వారిలో ఒకరు దిల్ రాజు అయితే.
మరొకరు శిరీష్ గారు అంటూ ప్రశంసలు కురిపించింది.అయితే రామలక్ష్మణుల పాత్రలు ఊహా జనితం అంటూ ఈమె మాట్లాడిన వ్యాఖ్యలపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అసలు నీకు రామాయణం అంటే ఏంటో తెలుసా అంటూ శ్రీముఖి వ్యవహార శైలిని తప్పుపడుతూ విమర్శలు కురిపిస్తున్నారు.
ఇలాంటి విమర్శలు రావడంతో ఈమె ఒక వీడియోని విడుదల చేశారు.ఇటీవల ఒక ఈవెంట్ లో రామలక్ష్మణుల గురించి మాట్లాడుతూ ఫిక్షనల్ క్యారెక్టర్ అనడం జరిగింది.నేను ఒక హిందువునే.నేను దైవ భక్తురాలినే.అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని.కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి.
ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాననీ అందరికీ మాట ఇస్తున్నాను దయచేసి నన్ను మీ పెద్ద మనసుతో క్షమించండి .జైశ్రీరామ్ అంటూ శ్రీముఖి క్షమాపణలు తెలియజేస్తూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.