తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నట కిరీటి రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇప్పటికీ కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా రాజేంద్రప్రసాద్ ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ప్రస్తుతం ఈయన షష్టిపూర్తి( Shashtipoorthi Movie ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .ఈ సినిమా వేడుకలో భాగంగా గతంలో అల్లు అర్జున్( Allu Arjun ) గురించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఒకప్పుడు సినిమాలు చేస్తే హీరోలు మంచి సందేశాన్ని ఇచ్చేవారు కానీ ఇప్పుడు మాత్రం దొంగతనాలు చేయడం చూపిస్తున్నారు .ఎర్రచందనం దొంగతనం చేసే వాడు హీరో ఏంటి అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు.దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో బన్నీ నాకు కొడుకుతో సమానం నేనెందుకు అలా మాట్లాడతాను అంటూ కవర్ చేసారు.
అయితే తాజాగా మీడియా ప్రతినిధి నుంచి రాజేంద్రప్రసాద్ కు ఇదే ప్రశ్న ఎదురయింది.
నేను ఎవరి గురించి కూడా నెగిటివ్ గా మాట్లాడాలి అనే స్వభావం ఉన్న వ్యక్తిని కాదు.అల్లు అర్జున్ ని రీసెంట్ గా కలిశా.అంకుల్ మీరు అలా మాట్లాడి ఉండరని నాకు తెలుసు అంటూ మాట్లాడారు.
ఆ సమయంలో ఓరి పిచ్చోడా నేను నిజంగానే అలా మాట్లాడాను రా అని చెప్పడంతో మీరు మాట్లాడిన ఆ ఉద్దేశంతో మాట్లాడి ఉండరు అంటూ అల్లు అర్జున్ తెలిపారు.కరెక్ట్ నా ఉద్దేశం అది కాదు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా నెగిటివిటీ బాగా పెరిగిపోయిందని తెలిపారు.నేను కూడా నెగిటివ్ రోల్స్ చేశాను.
లేడీస్ ట్రైలర్, అప్పుల అప్పారావు, పేకాట పాపారావు లాంటి చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేశాను.నా పాత్రలని నేనే తిట్టుకున్నా.
పుష్ప 2 విషయంలో కూడా అదే ఉద్దేశంతోనే మాట్లాడాను ఆ సినిమాలో వాడు దొంగ కాకపోతే మహానుభావుడా .మామూలు దొంగ కూడా కాదు.ఎర్రచందనం దొంగ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.