నేను ఆ భారం అనుభవించాను... నా కూతురికి వద్దు... రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!

రామ్ చరణ్( Ram Charan ) గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ బిజీబిజీగా ఉన్నారు.

 Ram Charan Emotional Comments About His Daughter Klin Kaara Details, Ram Charan,-TeluguStop.com

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా జనవరి 10వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో రామ్ చరణ్ బాలకృష్ణ( Balakrishna ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి( Unstoppable Show ) హాజరయ్యారు ఇందులో భాగంగా బాలకృష్ణ రామ్ చరణ్ భార్య కుమార్తె గురించి ప్రశ్నలు వేశారు.

Telugu Balakrishna, Game Changer, Klin Kaara, Ram Charan, Ram Charan Face, Upasa

ముఖ్యంగా ఉపాసన( Upasana ) రాంచరణ్ వివాహం చేసుకున్న 11 సంవత్సరాలకు ఆడబిడ్డకు జన్మనిచ్చారు.పాప పుట్టినరోజున రామ్ చరణ్ స్వయంగా థియేటర్లోకి వెళ్లి తనకు పాప పుట్టిందని ఆ చిన్నారిని తన చేతులతో తీసుకొస్తూ ఉన్నటువంటి ఒక వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది అయితే ఆ వీడియోని బాలయ్య షోలో చూపించారు.ఈ వీడియోని చూసి రామ్ చరణ్ కాస్త ఎమోషనల్ అయ్యారు.

Telugu Balakrishna, Game Changer, Klin Kaara, Ram Charan, Ram Charan Face, Upasa

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ నేను మొదటినుంచి కూడా పాపే కావాలనుకున్నాను అనుకున్న విధంగా పాప పుట్టిందని తెలిపారు.ప్రస్తుతం నా కూతురితో కలిసి నేను ఎంతో విలువైన సమయాన్ని గడుపుతున్నాను.ఇక తన కూతురిని ఇప్పటివరకు ఎవరికీ చూపించకపోవడానికి కారణం లేదని తెలిపారు .ఆర్టిస్టులు అన్న తర్వాత వారికి ప్రైవసీ ఏమాత్రం ఉండదు.ఇక మేము చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళినా కూడా ఆర్టిస్ట్ పిల్లలమని మమ్మల్ని గుర్తించడం వల్ల మాకంటూ ప్రైవసీ లేకుండా పోయింది.అలాంటి సమయంలో నేను ఎంతో భారం అనుభవించాను ఆ భారం నా కూతురికి ఉండకూడదని భావిస్తున్నాను అందుకే తనకు ప్రైవసీని గిఫ్టుగా ఇద్దామనుకున్నాను.

ఈ ఒక కారణంతోనే నా కూతురిని ఇప్పటివరకు ఎవరికీ పరిచయం చేయలేదని సమయం వచ్చినప్పుడు అందరికీ పరిచయం చేస్తాను అంటూ రాంచరణ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube