చుండ్రు. ఒక్కసారి పట్టుకుంది అంటే అంత సులభంగా వదిలి పెట్టదు.చుండ్రు కారణంగా తలలో విపరీతమైన దురద, చిరాకు పుడుతుంది.పైగా తలలో చుండ్రు ఉంటే చర్మంపై మొటిమలు కూడా వస్తుంటాయి.ఈ నేపథ్యంలోనే చుండ్రును నివారించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.కొందరు ఖరీదైన షాంపూలను వాడుతుంటారు.
అయితే షాంపూ వల్ల ప్రయోజనం ఎంత ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఆయిల్ ను వారంలో రెండు సార్లు కనుక వాడితే చుండ్రు అన్న మాటే అనరు.
మరి ఇంకెందుకు ఆలస్యం చుండ్రును తరిమికొట్టే ఆ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ పౌడర్, ఒక కప్పు ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడుగ్లాస్ జార్ కు మూత పెట్టి మరుగుతున్న నీటిలో కనీసం పదిహేను నిమిషాల పాటు ఉంచాలి.ఆపై పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ లో సపరేట్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన అనంతరం ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.
ఈ ఆయిల్ ను జుట్టు కుదుళ్ల బాగా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను రాసుకుని మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు కనుక ఈ ఆయిల్ లో వాడితే చుండ్రు దెబ్బకు పరార్ అవుతుంది.
మళ్లీ మళ్లీ రాకుండా సైతం ఉంటుంది.అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.
తెల్ల జుట్టు సైతం త్వరగా రాకుండా ఉంటుంది.