తల మొత్తం చుండ్రు( Dandruff ) పట్టేసిందా.? ఎంత ప్రయత్నించినా చుండ్రు పోవడం లేదా.? చుండ్రు కారణంగా తలలో దురద పెరిగిపోయిందా.? చర్మంపై మొటిమలు కూడా వస్తున్నాయా.? చుండ్రు వల్ల జుట్టు రాలడం అధికమైందా.? అయితే అసలు చింతించకండి.చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే కేవలం ఒకే ఒక్క వాష్ లోనే మాయం అవుతుంది.ఈ రెమెడీని పాటించాక రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసుకోవాలి.అలాగే అర కప్పు ఎండిన ఆరెంజ్ తొక్కలు( Orange Peels ) మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న బియ్యం, మెంతులు, ఆరెంజ్ తొక్కలను వాటర్ తో సహా వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ), వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు దెబ్బకు మాయం అవుతుంది.స్కాల్ప్ శుభ్రంగా ఆరోగ్యంగా మారుతుంది.తలలో దురద ఇన్ఫెక్షన్స్ వంటివి దూరం అవుతాయి.
కాబట్టి చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ మ్యాజికల్ రెమెడీని పాటించండి.పైగా ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల జుట్టు సిల్కీగా, షైనీ( Silky and Shiny Hair ) గా మారుతుంది.
హెయిర్ గ్రోత్ లేదని బాధపడుతున్న వారు కూడా ఈ రెమెడీని పాటించవచ్చు.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.