ఏడడుగులతో మొదలై, ఆరు కాలాల పాటు చల్లగా ఉండాలనే కమిట్ మెంట్ తో, పంచభూతాల సాక్షిగా, నాలుగు వేదాల నడుమ, మూడు ముళ్ళ బంధంతో, రెండు నిండు జీవితాలు ఒక్కటయ్యే అరుదైన వేధిక ఈ పెళ్లి….అలాంటి ఈ పెళ్లి వేడుక ప్రతీ ఒక్కరికీ జీవితంలో ఒక్కసారి మాత్రమే జరగాలి.
కానీ దురదృష్టమో, అదృష్టమో కొందరికి రెండు, మూడు సార్లు జరుగుతుంది.జీవిత భాగస్వామి చనిపోవడం కారణంగానో, మనస్పర్ధలు వచ్చి విడిపోవడం కారణంగానో మళ్ళీ వివాహం చేసుకోవాల్సి వస్తుంది.
యాక్చువల్ గా రెండో పెళ్లి అనగానే చాలా మంది పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు.చనిపోయిన భాగస్వామి మిగిల్చిన జ్ఞాపకాలతోనే జీవితం మొత్తం గడిపేస్తారు, బతికేస్తారు.అదే విడాకులు తీసుకున్న వారు ఐతే మాత్రం పెళ్లి పట్ల విరక్తి భావం కలిగి ఉంటారు.పెళ్లి ఊసెత్తితే ఉరికించి ఉరికించి కొడతారు.
ఇక ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు అని క్లాసులు పీకుతారు.ఏ పార్టీకో వెళ్తే చేతిలో మందు గ్లాసు పట్టుకుని ‘వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా’ అంటూ పాటలు పాడతారు.
సోలో బ్రతుకే సో బెటరూ అంటూ సింగిల్స్ ఏంథమ్స్ ని వినిపిస్తారు.అదో జాతీయ గీతంగా ప్రకటిస్తారు.
సరే ఎంత చేసినా జీవితమనే ఐమాక్స్ థియేటర్ లో మళ్ళీ పెళ్లి అనే సినిమాకి క్లైమాక్స్ సీన్ అనేది ఒకటి ఉంటుంది.ఆ సీన్ వచ్చిందంటే ఎవ్వరైనా మళ్ళీ పెళ్లి పీటలు ఎక్కాల్సిందే.
గోల్డ్ రింగులు మార్చుకోవాల్సిందే.అలా రెండో పెళ్ళికి సిద్ధమైన వాళ్ళు, రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.వాళ్ళలో సినిమా వాళ్ళంటే మనకి బాగా ఇంట్రస్ట్ కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకున్న, చేసుకోబోతున్న టాలీవుడ్ ప్రముఖుల గురించి తెలుసుకుందాం.
సింగర్ సునీత :

రెండో పెళ్ళికి సిద్ధమైన వారిలో సింగర్ సునీత ఒకరు.ఈమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారు.మై మ్యాంగో మ్యూజిక్ సీఈఓ రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.
ప్రతి తల్లిలానే తన పిల్లలను మంచి పొజిషన్ లో నిలబెట్టాలని కలలు కంటున్నాను.అదే సమయంలో ఆమె కూడా సంతోషంగా ఉండాలని తన పిల్లలు మరియు తల్లిదండ్రులు కలలు కంటున్నారు.
ఆ క్షణం వచ్చింది.ఒక స్నేహితుడిగా, గొప్ప జీవిత భాగస్వామిగా తన జీవితంలో రామ్ ప్రవేశించారని అన్నారు.
త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.ఈమె 19 ఏళ్ల వయసులో కిరణ్ కుమార్ గోపరాజు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వీరికి ఆకాష్ గోపరాజు, శ్రేయ గోపరాజు అనే ఇద్దరు పిల్లలు జన్మించారు.అయితే కొన్నాళ్ళకి సునీత, కిరణ్ కుమార్ ల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.
మళ్ళీ ఇన్నాళ్ళకి 42 ఏళ్ల వయసులో పిల్లలు, తల్లిదండ్రుల కోరిక మేరకు సునీత రెండో వివాహానికి రెడీ అవుతున్నారు.నిశ్చితార్ధం చేసుకున్న సునీత, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.ఆ డేట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ప్రభుదేవా :

ఇండియన్ మైఖేల్ జాక్సన్, యాక్టర్, అండ్ డైరెక్టర్ ప్రభుదేవా రెండో పెళ్లి విషయంలో చాలానే రూమర్స్ వచ్చాయి.ఆయన నయనతారతో ప్రేమలో పడ్డారని, ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, ఆ తర్వాత విడిపోయారని వార్తలు వచ్చాయి.ఆ తర్వాత వార్తలు పలుచబడ్డాయి.
అయితే ప్రభుదేవా సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నారని, బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకున్నారని కథనాలు రావడంతో ఆయన సోదరుడు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు.ఇదే ఇయర్ లో లాక్ డౌన్ సమయంలో మే నెలలో ముంబైకి చెందిన హిమాని అనే డాక్టర్ ని పెళ్లి చేసుకున్నట్టు చెప్పుకొచ్చారు.1995 లో రమాలత్ అనే యువతిని పెళ్లి చేసుకున్న ప్రభుదేవా, ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.
సామ్రాట్ :

బిగ్ బాస్ సీజన్ 2 ఫేమ్ సామ్రాట్ మొదటిసారి హర్షిత అనే యువతిని వివాహం చేసుకున్నారు.అయితే వీరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు.మళ్ళీ ఇన్నాళ్ళకి జీవితంలో ఒక తోడు ఉంటే బాగుంటుందని ఫిక్స్ అయిన సామ్రాట్ హార్ట్ లో ఉన్న గ్యాప్ ని ఫిల్ చేసుకున్నారు.
కాకినాడకు చెందిన శ్రీ లిఖిత అనే యువతిని వివాహం చేసుకున్నారు.ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.కరోనా కారణంగా కొంతమంది మాత్రమే వీరి పెళ్లికి హాజరయ్యారు.దీప్తి సునయన, తనీష్ లు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు.
నిర్మాత దిల్ రాజు :

ఇక టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య అనిత చనిపోయిన తర్వాత మూడేళ్ళ పాటు ఆయన ఒంటరిగా ఉంటూ వచ్చారు.అయితే ఆయన కూతురు, తన తండ్రికి తోడు ఉండాలని పట్టుబట్టడంతో దిల్ రాజు రెండో పెళ్ళికి ఒప్పుకున్నారు.31 ఏళ్ల తేజస్విని అనే యువతిని వివాహం చేసుకున్నారు.ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో హోస్ట్ గా పని చేస్తున్నారని, దిల్ రాజుకు బాగా తెలిసిన అమ్మాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.
కరోనా, తుఫాను, భారీ వర్షాలు, వరదలు, వింత వ్యాధులు ఇలా 2020 చాలా మందికి వరస్ట్ ఎండింగ్ నిస్తే, వీళ్ళకి మాత్రం మళ్ళీ పెళ్లి అనే సరికొత్త వేడుకతో హ్యాపీ ఎండింగ్ నిచ్చింది.ఏదైతేనేం మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాల్లోనూ, చేసుకోబోతున్న వాళ్ళ జీవితాల్లోనూ కొత్త ఆశలు చిగురించాలని, ఆ భగవంతుడు కొత్త వెలుగులు ప్రసాదించాలని కోరుకుందాం.