అందంగా మెరిసిపోవడం కోసం చాలా మంది మేకప్ ను ఆశ్రయిస్తున్నారు.అసలు మేకప్ లేకుంటే బయట కాలు పెట్టడానికి కూడా కొందరు ఇష్టపడడం లేదు.
అంతలా మేకప్ కు అలవాటు పడిపోయారు.అయితే మేకప్ ఉత్పత్తులను రెగ్యులర్ గా వాడటం వల్ల చర్మ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది.
భవిష్యత్తులో ఎన్నో చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అందుకే చర్మాన్ని న్యాచురల్ గానే అందంగా మెరిపించుకునేందుకు ప్రయత్నించాలి.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటిస్తే కనుక సహజంగానే మేకప్ లుక్ పొందొచ్చు.మరి ఇంతకీ ఆ మ్యాజికల్ రెమెడీ ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో ఒక కప్పు కడిగిన బియ్యాన్ని వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా ఉడికించిన మిశ్రమం నుంచి రైస్ వాటర్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ రైస్ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.చివరిగా ఇందులో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు సరిపడా రైస్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకొని కనీసం ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా కనుక చేస్తే చర్మం సహజంగానే అందంగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది.చర్మంపై మొండి మచ్చలు, మొటిమలు ఏమైనా ఉంటే క్రమంగా దూరమవుతాయి.
పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మ ఛాయ సైతం మెరుగుపడుతుంది.