తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు ఉన్నప్పటికీ తమిళ్ నుంచి తెలుగులోకి డబ్ అయిన సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తమిళ హీరోలని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య అజిత్, విక్రమ్ లాంటి ఆర్టిస్ట్ లు వీళ్లతో పాటు అప్పట్లో హీరోగా వచ్చిన కార్తీక్, ప్రభు లాంటి వాళ్లను కూడా ఆదరించారు.అయితే వీళ్ళు అందరిలో కమల్ హాసన్, రజనీకాంత్ మాత్రం తెలుగు సినిమాలో తెలుగు డైరెక్టర్లతో చేస్తూ పెద్ద హీరోలు గా గుర్తింపు పొందారు వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుంది అంటే తమిళ్ లో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉండేది.
విశ్వనాథ్ గారి దర్శకత్వంలో శుభ సంకల్పం, సాగరసంగమం, స్వాతిముత్యం లాంటి సినిమాల్లో నటించి నటనలో తనకు పోటీ ఎవరు లేరని చూపించిన హీరో కమల్ హాసన్ అయితే కమల్ హాసన్ కి పోటీ గా తెలుగులో రజనీకాంత్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి.భాష, ముత్తు, నరసింహ లాంటి సినిమాలు రజినీకాంత్ కెరియర్లో తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు.
అయితే అప్పట్లో వీళ్లతో పాటు మోహన్ అనే ఇంకో హీరో కూడా తమిళంతో పాటు తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో కనిపించాడు.
తమిళ్ లో మోహన్ తీసిన కోకిల సినిమా అక్కడ సంవత్సరం ఆడింది దాంతో ఆయనకు వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి.
దీంతో తమిళంలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే అప్పటికే ఇక్కడ కార్తీక్ ప్రభు లాంటి హీరోలు తెలుగులో కూడా వాళ్ల హవా చూపిస్తున్న సమయం లో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి బాపు తీసిన తూర్పు వెళ్ళే రైలు సినిమా లో మోహన్ నటించాడు మోహన్ నీ మైక్ మోహన్ అని కూడా అంటారు ఎందుకంటే ఆయన సినిమాల్లో ఎక్కువగా మైక్ పట్టుకొని పాటలు పాడే పాత్రలు చేయడం వల్ల మైక్ మోహన్ అంటారు.అయితే మోహన్ గారి కోకిల సినిమా హిట్ కావడంతో అతన్ని కోకిల మోహన్ అని కూడా అంటారు.
మోహన్ కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ లో వంశీ డైరెక్షన్లో వచ్చిన ఆలాపన సినిమాలో నటించాడు, ఆ తర్వాత జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన చూపులు కలిసిన శుభవేళ సినిమాలో నటించాడు, మణిరత్నం దర్శకత్వంలో కార్తీక్ రేవతి హీరో హీరోయిన్లుగా నటించిన మౌనరాగం సినిమాలో కూడా మోహన్ నటించాడు.

అయితే చాలా మందికి వంశీ గారి డైరెక్షన్లో, బాపుగారి డైరెక్షన్లో, జంధ్యాల డైరెక్షన్లో, మణిరత్నం డైరెక్షన్ లో నటించాలని ఉంటుంది.కానీ మోహన్ కి వాళ్ళందరి డైరెక్షన్ లో నటించే అవకాశం వచ్చింది తమిళం నుంచి తెలుగులోకి వచ్చిన హీరోల్లో ముందుగా అనుకున్నట్టు రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు అగ్ర హీరోలుగా కొనసాగారు.ప్రస్తుతం తమిళం నుంచి తెలుగులోకి వచ్చిన హీరోల్లో సూర్య,కార్తీ, విక్రమ్ లాంటి హీరోలు తెలుగులో కూడా అగ్రహీరోలు గా కొనసాగుతున్నారు.
సూర్య తీసిన ప్రతి సినిమా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుండటం వల్ల సూర్య కి తమిళ్ లో ఎంత మార్కెట్ అయితే ఉందో తెలుగులో కూడా అంతే మార్కెట్ ఉంది.తమిళ్ తో పోల్చుకుంటే తెలుగులోనే సూర్య కి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పచ్చు.
అలాగే విక్రమ్ కూడా తెలుగులో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన చేసిన శివ పుత్రుడు సినిమా తెలుగులో డబ్ అయి మంచి విజయం సాధించింది.తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమా తో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విక్రమ్ తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఆ తర్వాత చాలా సినిమాలను తెలుగులో డబ్ చేసి హిట్ కొట్టాడు.