నా కూతురికి నేనిచ్చే పెద్ద బహుమతి అదే.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రామ్ చరణ్( Ram Charan ) ఉపాసన( Upasana ) ల గురించి మనందరికీ తెలిసిందే.ఈ జంటకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Ram Charans Biggest Gift To His Daughter Details, Ram Charan, Ram Charan Daughte-TeluguStop.com

కాగా ఈ దంపతులు పెళ్లయిన దాదాపు దశాబ్దం తర్వాత తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే.వీరిద్దరికీ క్లింకార( Klin Kaara ) అనే పాప పుట్టింది.

అయితే పాప పుట్టి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు పాప ఫేస్ ని మాత్రం రివీల్ చేయలేదు మెగా ఫ్యామిలీ.పాప ఫేస్ కెమెరా కంట పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ వస్తున్నారు.

అయితే తాజాగా ఇందుకు గల కారణాన్ని వెల్లడించారు హీరో రామ్ చరణ్.హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.

క్లింకారను ఎప్పుడు చూపిస్తావని అంతా అడుగుతుంటారు.

Telugu Balakrishna, Game Changer, Klin Kaara, Klin Kaara Face, Ram Charan, Ram C

కానీ క్లింకారకు ప్రైవసీ చాలా ముఖ్యం.ఎంత కోరుకున్నా దొరకనది అదే.అందుకే నా కూతురికి నేనిచ్చే పెద్ద బహుమతి ప్రైవసీ.వాళ్లంతట వాళ్లు ఎదగడానికి, ఒత్తిడి లేకుండా పెరగడానికి, క్లింకార మొహాన్ని( Klin Kaara Face ) ఎంతవరకు వీలైతే అంతవరకు చూపించకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను.స్కూల్ డేస్ లో మమ్మల్ని బాగా గుర్తుపట్టేవాళ్లు.

దానివల్ల మేం సరిగ్గా ఉండలేకపోయేవాళ్లం.అదంతా నాకు చిన్న భారంగా ఉండేది.

అందుకే మా పాపకు ఆ భారం లేకుండా చేయాలనుకున్నాను అని చరణ్ తెలిపారు.

Telugu Balakrishna, Game Changer, Klin Kaara, Klin Kaara Face, Ram Charan, Ram C

అయితే ఒక సందర్భంలో మాత్రం పాపను ప్రపంచానికి పరిచయం చేస్తానంటున్నాడు చరణ్.ఇప్పటి వరకు పాప, అమ్మా అని మాత్రమే అంటోందట.ఎప్పుడైతే క్లింకార తనను నాన్న అని పిలుస్తుందో, ఆ మరుక్షణం ఆమెను ప్రపంచానికి పరిచయం చేస్తానని తెలిపారు రామ్.

ఈ విషయాలన్నీ కూడా తాజాగా బాలయ్య బాబు షోలో పంచుకున్నారు రామ్ చరణ్.తాను నటించిన గేమ్ చేంజర్( Game Changer ) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య బాబు షోలో పాల్గొన్నారు.

ఇకపోతే రామ్ చరణ్ నటించిన గేమ్ చేజర్ మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube