సాధారణంగా ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది.దాని ముందు కుక్క ఒక ఆట బొమ్మ కంటే చిన్నగానే ఉంటుందని చెప్పుకోవచ్చు.
దాన్ని చూస్తేనే సింహాలు, పులులు, ఖడ్గమృగాలు(Lions, tigers, rhinos) సైతం కూడా తోక ముడిచి పారిపోతాయి.అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అడవుల శాఖకు చెందిన రిటైర్డ్ అధికారి సుశాంత నంద ఈ 21 సెకన్ల వీడియోను X (ట్విట్టర్) లో పోస్ట్ చేయగా, అది కాస్తా నెటిజన్లను కట్టిపడేసింది.భయం, నవ్వు కలగలిసిన ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వీడియో మొదట్లో ఒక ఏనుగు ( elephant)రోడ్డు మీద నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక వీధి కుక్క(DOG) ఎక్కడినుంచో వచ్చి దాన్ని గమనించడం మొదలుపెట్టింది.ఏమాత్రం భయం లేకుండా ఏనుగుకు ఎదురుగా వెళ్లి నిలబడింది.
అంతే.ఏనుగు ఒక్కసారిగా ఆగిపోయి కుక్కను ఒకరకమైన కోపంతో చూసింది.
కానీ కుక్క మాత్రం బెదరకుండా తోక ఊపుతూ అక్కడే నిలబడింది.దీంతో టెన్షన్ మొదలైంది.
అంతే.ఏనుగు ఒక్కసారిగా కుక్క వైపు కొన్ని అడుగులు వేసింది.ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కుక్క మీదకు దూసుకొచ్చింది.ఊహించని ఈ పరిణామానికి కుక్క ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పరుగులు పెట్టింది.
ఏనుగు తన అధికారాన్ని చాటుకుంటే, కుక్క మాత్రం వెనక్కి తగ్గక తప్పలేదు.ఈ సీన్ చూస్తుంటే మాత్రం ఒళ్లు గగుర్పొడుస్తుంది.
సుశాంత నంద ఈ వీడియోకు మరింత హాస్యాన్ని జోడించారు.“చూపులతోనే చంపేయగలదు! ఏనుగు కుక్క (elephant, Dog)మీదకు వస్తున్నప్పుడు దాని ఎక్స్‌ప్రెషన్ చూడండి, OMG” అంటూ క్యాప్షన్ పెట్టారు.నిజంగానే ఆ ఏనుగు చూపులు అంతలా ఉన్నాయి మరి.ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
ఒక యూజర్ కామెంట్ చేస్తూ “ఆ కుక్క ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాలి కానీ, దెబ్బకు తోకముడిచింది చూడు!” అని అన్నారు.మరొకరు “ఏనుగు అలా చూస్తే ఎవరికైనా విషయం అర్థమైపోతుంది” అంటూ ఫన్నీ కామెంట్ పెట్టారు.చాలామంది ఈ సీన్‌ను చూసి కడుపుబ్బ నవ్వుకున్నారు.“యాక్షన్ సినిమాలు ఎందుకు.ఇలాంటివి చూస్తే చాలు కదా” అని ఇంకొకరు అన్నారు.కొందరైతే పాపం కుక్క పిల్ల అనుకుంటున్నారు.“కొత్త ఫ్రెండ్ కోసం ట్రై చేసింది కానీ అందరూ ఫ్రెండ్లీగా ఉండరని తెలుసుకుంది” అంటూ ఒక కామెంట్ వైరల్ అవుతోంది.
మొత్తానికి ఈ కుక్క, ఏనుగు మధ్య జరిగిన ఫన్నీ సంఘటన ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
దీన్ని మీరు కూడా చూసేయండి.