బాలయ్య దబిడి దిబిడి సాంగ్ కోసం ఊర్వశి షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎంతంటే?

సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ అని చెప్పాలి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తాయి.ఇక ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు సినిమాలు వరుసగా విడుదల కానున్న నేపథ్యంలో థియేటర్ల వద్ద అసలైన సంక్రాంతి పండుగ కనపడునుంది.

 Urvashi Rautela Takes Huge Remuneration For Dabidi Dibidi Song Details, Urvashi-TeluguStop.com

ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) నటించిన డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమా విడుదల కాబోతోంది.

Telugu Balakrishna, Daaku Maharaaj, Dabidi Dibidi, Daku Maharaj, Urvashi Rautela

డైరెక్టర్ బాబీ( Bobby ) దర్శకత్వంలో నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా 12వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఊర్వశీ రౌతెల( Urvashi Rautela ) స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు.తాజాగా ఈ పాటను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ పాట భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నది.ముఖ్యంగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ పై విమర్శలు వస్తున్నాయి.

Telugu Balakrishna, Daaku Maharaaj, Dabidi Dibidi, Daku Maharaj, Urvashi Rautela

ఇలా స్పెషల్ సాంగులో నటి ఊర్వశి సందడి చేయడంతో ఈ పాట కోసం ఈమె తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం ఓ వార్త సంచలనంగా మారింది.దబిడి దిబిడి అంటూ( Dabidi Dibidi Song ) సాగిపోయే ఈ పాటలో ఆమె నడుము, బ్యాక్ టచ్ చేస్తూ బాలయ్య వేసిన స్టెప్స్‌ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.అయినప్పటికీ ఈ సాంగ్‌కు మాస్ జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.ఇక ఈ పాటలో ఈమె నటించడానికి అక్షరాల కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి.

ఐదు నిమిషాలకే కోటి రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు.మరి ఈమె రెమ్యూనరేషన్ కి  సంబంధించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube