గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!

అసలే చలికాలం.( Winter ) రోజూ ఉద‌యం మంచు వాన‌లా కురుస్తోంది.

 This Tea Helps To Get Rid Of Sore Throat In Winter Details, Sore Throat, Sore T-TeluguStop.com

పొరపాటున ఆ మంచులో కొంచెం సేపు తిరిగిన ముక్కు, గొంతు మటాష్.చలికాలంలో అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో గొంతు నొప్పి( Sore Throat ) ఒకటి.

పొడి గాలి, శ్వాసకోశ వ్యాధులు, చలికాలపు అలర్జీలు, పొగ లేదా కాలుష్యానికి గురికావడం తదితర అంశాలు గొంతు నొప్పికి కార‌ణం అవుతుంటాయి.ఇది చిన్న సమస్యే అయినప్పటికీ.

ఎంతో అసౌకర్యానికి మరియు బాధకు గురిచేస్తుంది.ఈ క్రమంలోనే గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం మందులు వాడుతూ ఉంటారు.

అయితే సాధారణ గొంతు నొప్పికి మందులతో అవసరం లేకుండా చెక్ పెట్టవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే టీ అద్భుతంగా సహాయపడుతుంది.

Telugu Black Pepper, Tips, Latest, Sore Throat, Sore Throat Tea, Turmeric Tea, T

అందుకోసం ముందుగా అర అంగుళం పచ్చి పసుపు కొమ్ము( Turmeric ) తీసుకుని శుభ్రంగా క‌డిగి పొట్టు తొలగించి మెత్తగా దంచుకోవాలి.అలాగే నాలుగు మిరియాల‌ను( Black Pepper ) కూడా దంచి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక దంచి పెట్టుకున్న మిరియాలు, పచ్చి పసుపు వేసుకొని దాదాపు పదినిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ని ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Black Pepper, Tips, Latest, Sore Throat, Sore Throat Tea, Turmeric Tea, T

ఈ వాట‌ర్ లో వన్ టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన తేనె,( Honey ) వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) మిక్స్ చేస్తే మన టీ అనేది రెడీ అవుతుంది.ఈ టర్మరిక్ టీ ప్రస్తుత చలికాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా గొంతు నొప్పి నివారణలో సూపర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

రోజుకు ఒకసారి ఈ టర్మరిక్ టీ ను తీసుకుంటే గొంతు నొప్పి దెబ్బకు పరారవుతుంది.జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్న దూరమవుతాయి.

శ‌రీర రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.వైరల్ ఇన్ఫెక్షన్లు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

పసుపులోని క్రియాశీల సమ్మేళనం కర్కుమిన్.ఇది ఆర్థరైటిస్ నొప్పికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.

కుర్కుమిన్ కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గించడంలోనూ తోడ్ప‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube