అక్కడ ఏం జరగలేదు... ఈ వివాదాన్ని పెద్దది చేయదు... డైరెక్టర్ బాబి షాకింగ్ కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో ఎన్టీఆర్ ( Ntr ) బాలకృష్ణ ( Balakrishna ) కూడా ఒకరిని చెప్పాలి అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మాటలు లేవని కనీసం బాలకృష్ణ ఎన్టీఆర్ పేరు పలకడానికి కూడా ఇష్టపడడం లేదంటూ ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణ తీరును తప్పుపడుతున్నారు.ఎన్టీఆర్ స్వయంగా తనకు కొడుకు వరుస అవుతారు అలాంటిది ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం మొత్తం దూరం పెడుతున్నారంటూ విమర్శలు కురిపించారు.

 Director Bobby Gives Clarity On Ntr And Balakrishna Issue, Balakrishna, Ntr, Un-TeluguStop.com

ఇక బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ( Un stoppable ) కార్యక్రమానికి ఎంతోమంది హీరోలు వస్తున్నారు కానీ ఇప్పటివరకు ఎన్టీఆర్ ను అసలు పిలవలేదని అలాగే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ పేరును కూడా బాలకృష్ణ పలకడం లేదు అంటూ ఫైర్ అవుతున్నారు.ఇక ఇటీవల ఈ కార్యక్రమానికి డైరెక్టర్ బాబీ( Bobby ) హాజరైన విషయం తెలిసిందే  ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన దర్శకత్వంలో పనిచేసిన హీరోల ఫోటోలను చూపించి బాలకృష్ణ వారి గురించి ప్రశ్నించారు.

అయితే ఈయన దర్శకత్వంలో ఎన్టీఆర్ జై లవకుశ సినిమా కూడా చేశారు కానీ బాలయ్య మాత్రం ఎన్టీఆర్ ఫోటోని చూయించలేదు.

Telugu Balakrishna, Bobby, Bobbyntr, Un Stoppable-Movie

ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్ ను బాలకృష్ణ అవమానిస్తున్నారంటూ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇక ఇదే విషయం గురించి తాజాగా డాకు మహారాజ్ సినిమా వేడుకలు రిపోర్టర్స్ నుంచి ప్రశ్న ఎదురవడంతో డైరెక్టర్ బాబి చెప్పిన సమాధానం సంచలనగా మారింది.అన్‌స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ ఫొటో చూపించి ఎడిటింగ్ లో తీసేసారా, మిమ్మల్ని ఎన్టీఆర్ గురించి అస్సలు మాట్లాడొద్దని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి మీ సమాధానం ఏంటని ప్రశ్నించారు.

Telugu Balakrishna, Bobby, Bobbyntr, Un Stoppable-Movie

ఈ ప్రశ్నకు బాబి సమాధానం చెబుతూ అక్కడ అంత పెద్ద డ్రామా ఏమి జరగలేదు.దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు.అక్కడ చూపించిన ఫోటోల గురించి మాత్రమే అడిగారు బాలయ్య.నేను వాటికే సమాధానం చెప్పాను అంతే.షూటింగ్ గ్యాప్ లో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.మా తారక్ అయితే ఈ పాత్రలో బాగా సెట్ అవుతాడు అంటూ ఎన్టీఆర్ గురించి బాలయ్య స్వయంగా చెప్పారు ఇక తనకు జై లవకుశ సినిమా అంటే కూడా చాలా ఇష్టమని బాలయ్య తనతో చెప్పినట్టు బాబి తెలిపారు.

మనమే లేనిపోనివి ఊహించుకొని ఈ వివాదాన్ని పెద్దది చేస్తున్నామంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube