కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విశాల్( Vishal ) ఒకరు.ఈయన తమిళంలో నటించిన సినిమాలు తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకున్నాయి.
దీంతో ఈయనకు తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ఇలా ఎప్పుడు ఎంతో ఎనర్జిటిక్ గా ప్రేక్షకులను సందడి చేసే విశాల్ ఇటీవల ఓ సినిమా వేడుకలో కనిపించిన తీరు అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.
ఈ సినిమా వేడుకలు హీరో విశాల్ ఎంతో బక్క చిక్కిపోయి కనిపించారు.ఆయన కళ్ల వెంట నీరు కారుతూనే ఉంది అలాగే ఆయన మాట్లాడేటప్పుడు కూడా వణికిపోతూ మాట్లాడటంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అసలు హీరో విశాల్ కి ఏమైంది ఎందుకిలా మారిపోయారు అంటూ పెద్ద ఎత్తున అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.అయితే ఈయనకు ఏం జరిగింది అనే విషయం గురించి సీనియర్ నటి కుష్బూ ( Kushboo ) క్లారిటీ ఇచ్చారు.
విశాల్ గత కొద్దిరోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు వైద్యులు ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.తాజాగా కుష్బూ మాట్లాడుతూ ఈ సినిమా వేడుకకు వచ్చిన రోజు విశాల్ డెంగ్యూ ఫీవర్ ( Dengue Fever ) తో బాధపడుతున్నారు దాదాపు 103 డిగ్రీల జ్వరం ఉంది.ఇంత జ్వరంలో కూడా ఎందుకు ఇక్కడికి వచ్చావు అని ప్రశ్నించగా ఆయన నటించిన మదగజరాజా సినిమా దాదాపు 11 సంవత్సరాల తర్వాత విడుదల కాబోతోంది.అందుకనే ఖచ్చితంగా రావాలని విశాల్ అనుకున్నాడని, ఈ క్రమంలోనే అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా వచ్చాడన్నారు.
ఈ ఈవెంట్ పూర్తి కాగానే విశాల్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.ప్రస్తుతం తన పరిస్థితి నిలకడగానే ఉందని కానీ కొంతమంది యూట్యూబర్స్ వారి వ్యూస్ కోసం విశాల్ గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు అంటూ కుష్బూ ఈ సందర్భంగా మండిపడ్డారు.నిజ నిజాలు తెలుసుకోకుండా తేలికగా వదంతులు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.