టాలీవుడ్ హీరో బాలకృష్ణ (Hero Balakrishna)నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్(Daaku maharaj ).ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.ఈ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని బాలయ్య బాబు (Balayya Babu)అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాతో మరో హిట్ గ్యారెంటీ అంటున్నారు మూవీ మేకర్స్.ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఈ మూవీపై అంచనాలను మరింత పెంచింది.ఇక విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు.అయితే తాజాగా పాత్రికేయుల సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు బాబీ కొల్లి, కథానాయికలు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ (Pragya Jaiswal, Shraddha Srinath)పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.
జనవరి 9న అనంతపురంలో భారీ ప్రీ ఈలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశాము.
డాకు మహారాజ్ (Daaku Maharaj)సినిమాని తెలుగునాట కావాల్సినన్ని థియేటర్లలో భారీగా విడుదల చేస్తున్నాము.యూఎస్ లో కూడా భారీ స్థాయిలోనే విడుదల ఉంటుంది.అక్కడ బుకింగ్స్ బాగున్నాయి.
తెలుగుతో పాటు తమిళ్ లోనూ జనవరి 12న విడుదలవుతోంది.డాకు మహారాజ్ సినిమాతో ఈ సంక్రాంతికి ఘన విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది.
సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి.ఈ సినిమా నేను చూసి నమ్మకంగా చెబుతున్నాను.
డాకు మహారాజ్ చిత్రం అసలు నిరాశ పరచదు.బాలకృష్ణ గారి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది అని తెలిపారు.
అనంతరం డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.ఇందులో ఐదు యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి.
ప్రతి సీక్వెన్స్ అభిమానులకు ఎంతో హై ఇస్తుంది.యాక్షన్ తో పాటు మంచి వినోదం, హత్తుకునే భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు డైరెక్టర్ బాబి.