మీకు ఒక కథ చెబుతాను.ఒక అద్భుతమైన చెఫ్.
మరింత అద్భుతమైన ఒక బిర్యానీని వండారు.కానీ వంటకం పూర్తయ్యాక తిని చూస్తే చాలా చండాలంగా ఉంది.
అలాంటి వంటకాన్ని తన హోటల్ కి వచ్చే కస్టమర్లకు వడ్డిస్తే కొట్టిన ఆశ్చర్యపడక్కర్లేదు.దాంతో మరోసారి ఉప్పు, నీళ్లు, మసాలా వేసి కింద మంట పెట్టాడు.
అప్పటికే చెడిపోయిన వంటకం ఆ తర్వాత ఎన్ని రిపేర్లు చేసినా పెంటే అవుతుంది కానీ అద్భుతమైన వంటకం ఎలా అవుతుంది చెప్పండి.దాంతో కస్టమర్లకు వడ్డించలేక, బయట పారేయను లేక కాస్త ఆగండి కాసేపట్లో వస్తుంది అదిరిపోయే వంట అంటూ బిల్డప్సిస్తూ ఉన్నాడు, కరెక్ట్ గా ఇది ప్రభాస్ ఆదిపురుష్ టీమ్ కి సరిపోతుంది.
ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా భారతదేశవ్యాప్తంగా సినిమా పుట్టిన అప్పటి నుంచి నేటి వరకు ఇంత దారుణమైన ట్రోలింగ్ కి గురైన సినిమా మరొకటి లేదు.బిన్ లాడెన్ లాంటి ఒక లుక్కుతో రావణున్ని పెట్టి కార్టూన్ సినిమా చూపిస్తానంటే విమర్శలను మించి నవ్వుల పాలయ్యే పరిస్థితి వచ్చింది.
అంత దారుణమైన పరిస్థితి.
అసలు సినిమా పైన వచ్చిన మీమ్స్ చూస్తే సినిమా తీసిన వారికి, అందులో చేసిన వారికి తల వంపులు తప్పదు అనే విషయం అర్థం కావాలి.కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు చిత్ర బృందం .ఆది పరిస్థితి.ఇప్పటికీ 500 కోట్లు ఖర్చుపెట్టినట్టుగా చూపించేశారు.ఇప్పుడు గ్రాఫిక్స్ మార్చటం అంటూ మరో 200 కోట్లు అదనంగా వడ్డిస్తున్నారు.అవి కూడా సరిపోవు, అంత పెట్టినా కూడా అవుట్ పుట్ మారే పరిస్థితి లేదు.ఎందుకంటే సినిమా మొదట్లోనే గాడి తప్పింది.
ఇక రిపేరు చేసినా కుదిరేలా కనిపించడం లేదు.ఇక సినిమా సంక్రాంతి కి రిలీస్ అన్నారు ఆ తర్వాత జూన్ అన్నారు ఇప్పుడు ఆగస్టు అంటున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్లో అందరూ ఏమంటున్నారంటే ఆగస్టులో కాదు కదా ఇంకో ఆరేళ్ల సమయం తీసుకున్న అది డౌట్ అని అంటున్నారు.రాధే శ్యామ్ ఫలితాన్ని మరోసారి చూడక తప్పదు అంటున్నారు.
ఇక ఇప్పుడు ఇంత వండి వాడ్చిన ఆది పురుష్ ని పారేస్తారా కస్టమర్స్ కి పెడతారా వేచి చూడాలి.పైగా ఈ సినిమాలో వచ్చే ప్రతి బిట్టు కూడా ఎక్కడో ఒక చోట కాపీ కనిపించడం అవన్నీ వీడియోస్ తో సహా నెటిజన్లు బయటపట్టి సినిమా దర్శకుని కడిగేశారు.