ఈ మధ్య కాలంలో దాదాపు అందరూ కళ్ళద్దాలు వాడుతుంటారు.చూపు మసరబారడం, తల నొప్పి వంటి కారణాల వల్ల కొందరు కళ్ళద్దాలు ధరిస్తే.మరికొందరు ఫ్యాషన్ గా పెట్టుకుంటారు.అయితే ఏ కారణం చేత పెట్టుకున్నా కళ్ళద్దాల వల్ల వచ్చే సమస్య ఒక్కటే.ముక్కుపై మచ్చలు పడటం.రెగ్యులర్‌గా స్పెట్స్‌ను వాడటం వల్ల ముక్కుపై నల్లగా మచ్చలు పడిపోతాయి.
దాంతో ముఖ సౌందర్యం దెబ్బ తింటుంది.అయితే స్పెట్స్ కారణంగా పడే మచ్చలను వదిలించడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల టమాటా రసం, ఒక స్పూన్ పుదీనా రసం మరియు అర స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు దూది సాయంతో ఈ మిశ్రమాన్ని ముక్కు, ఆపై కావాలనుకుంటే ముఖానికి అప్లై చేయాలి.ఆ తర్వాత ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి ఇప్పుడు గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే క్రమంగా నల్ల మచ్చలు మాయం అవుతాయి.
అలాగే దోసకాయ తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలక్ష రెండు స్పూన్ల దోసకాయ రసం, ఒక స్పూన్ మజ్జిగ వేసుకుని కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముక్కుపై అప్లై చేసి పావు గంట పాటు ఆరనివ్వాలి.
అనంతరం కూల్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజూ చేయడం వల్ల సైతం కళ్ళద్దాల కారణంగా పడిన మచ్చలు తగ్గుతాయి.
ఇక గిన్నెలో ఒక స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, ఒక స్పూన్ బాదం ఆయిల్ మరియు ఒక స్పూన్ పాలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముక్కుపై అప్లై చేసి కాస్త ఆరిన తర్వాత మెల్ల మెల్లగా రుద్దుకుంటూ గోరు వెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.