హెయిర్ ఫాల్ ( Hair fall )కారణంగా ఆడవారే కాదు మగవారు సైతం ఎంతగానో సఫర్ అవుతూ ఉంటారు.పురుషుల్లో జుట్టు అధికంగా రాలడానికి పలు కారణాలు ఉన్నాయి.
ముఖ్యంగా ధూమపానం, ఒత్తిడి, కంప్యూటర్ల ముందు గంటలు తరబడి కూర్చుని పని చేయడం, పోషకాల కొరత, షాంపూ సమయంలో చేసే పొరపాట్లు, వేడి వేడి నీటితో తల స్నానం చేయడం వంటి అంశాలు హెయిర్ ఫాల్ కు దారితీస్తాయి.ఈ క్రమంలోనే జుట్టు రాలడాన్ని నివారించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ చాలా బాగా సహాయపడుతుంది.ఈ ఆయిల్ ను వారానికి రెండు సార్లు వాడిన చాలు హెయిర్ ఫాల్ దెబ్బకు కంట్రోల్ అవుతుంది.
మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక చిన్న ఉల్లిపాయను ( onion )తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఐరన్ కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె( coconut oil ) వేసుకోవాలి.ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( fenugreek ), రెండు టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( Kalonji Seeds ), రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన బాదం వేసుకొని కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.జుట్టు రాలడాన్ని ఆపడానికి ఈ ఆయిల్ ఎంతో ఉత్తమం గా సహాయపడుతుంది.
ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని పదినిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.

ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు లేదా నాలుగు గంటల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.జుట్టు రాలడం తగ్గుతుంది.
ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న పురుషులకు ఈ ఆయిల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.