కుంకుమపువ్వు.( Saffron ) చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
అలాగే చక్కటి సువాసన కలిగి ఉండే ఈ సుగంధ ద్రవ్యం చాలా ఖరీదైనది.కాశ్మీర్ లోయలో పండే కుంకుమపువ్వు కిలో దాదాపు నాలుగు లక్షల వరకు ఉంటుంది.
సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో కుంకుమపువ్వును వాడమని పెద్దలు చెబుతుంటారు.కుంకుమపువ్వు పాలు తాగితే పుట్టబోయే బిడ్డ తెల్లగా అందంగా పుడతారని నమ్మకం.
ఇదంతా పక్కన పెడితే కుంకుమపువ్వును గర్భిణీలే కాదు ఎవ్వరైనా తీసుకోవచ్చు.కుంకుమ పువ్వులో అనేక ఔషధ గుణాలు నిండి ఉంటాయి.
అవి మనకు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి.
ఎన్నో జబ్బుల నుంచి రక్షిస్తాయి.
అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా కుంకుమపువ్వు సహాయపడుతుంది.చిటికెడు కుంకుమపువ్వుతో మచ్చల్లేని తెల్లటి మెరిసే చర్మాన్ని పొందొచ్చు.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో చిటికెడు కుంకుమపువ్వు( Saffron ) తో పాటు అంగుళం కచ్చాపచ్చాగా దంచిన ములేటి చెక్క( Muleti wood ) వేసి దాదాపు పది నిమిషాల వరకు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం ఫిల్టర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ వాటర్ ను వారం రోజుల పాటు వాడుకోవచ్చు.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు చందనం పొడి( Sandalwood powder )మరియు తయారు చేసి పెట్టుకున్న వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే స్కిన్ వైట్ గా బ్రైట్ గా మారుతుంది.అలాగే ఈ రెమెడీతో చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.దీంతో మొటిమలు( pimples ) రావడం కంట్రోల్ అవుతాయి.మొటిమల తాలూకు మచ్చలు ఏమైనా ఉన్న క్రమంగా మాయం అవుతాయి.
మరియు సహజంగానే మీ చర్మం అందంగా మెరుస్తుంది.