దర్శకధీరుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి…( Director Rajamouli ) ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో( Mahesh Babu ) సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించి పాన్ వరల్డ్ లో తెలుగు సినిమా స్థాయిని పెంచుతుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.
మరి దానికి తగ్గట్టుగానే రాజమౌళి కూడా ఈ సినిమాని భారీ రేంజ్ లో చిత్రీకరించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించిన రాజమౌళి తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని గోవాలో( Goa ) ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందట.
ఇక మహేష్ బాబు కూడా మొదటి షెడ్యూల్లో పాల్గొని కొన్ని సీన్స్ ను చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఆ తర్వాత మరో రెండు మూడు నెలల గ్యాప్ ఇచ్చి విదేశాల్లో ఈ సినిమా షూట్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా 2027 వ సంవత్సరంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.అయితే రెండు పార్టు లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటికే మహేష్ బాబు మాత్రం ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకున్నాడు.
ఇక దానికి తగ్గట్టుగానే భారీ డేట్స్ ని కూడా ఈ సినిమా మీద కేటాయించినట్టుగా తెలుస్తోంది.
అతను అనుకున్నట్టుగానే సక్సెస్ సాధించి మంచి విజయాలను అందుకున్నట్లైతే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా అద్భుతంగా నిలుస్తుందనే చెప్పాలి.ఇక ఏది ఏమైనా తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా స్థాయి కి తీసుకెళ్లిన మొదటి దర్శకుడు రాజమౌళి, అలాగే పాన్ వరల్డ్ కి తీసుకెళ్లిన మొదటి దర్శకుడు కూడా రాజమౌళినే కావడం విశేషం…
.