ఆ విషయాలు చెబితే కాపురాలు కూలిపోతాయి... బిగ్ బాస్ హిమజ సంచలన వ్యాఖ్యలు?

బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి హిమజ ( Himaja ) అనంతరం సినిమాలలో అవకాశాలను అందుకుంటూ కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.ఇలా స్టార్ హీరోల సినిమాలలో హిమజ బాగమవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.

 Bigg Boss Himaja Sensational Comments On Her Love Break Up , Himaja, Bigg Boss,-TeluguStop.com

ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమెకు బిగ్ బాస్ ( Bigg Boss ) అవకాశం కూడా వచ్చింది.ఇలా బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న హిమజ టైటిల్ అందుకోకపోయినా తన ఆటతీరుతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

Telugu Bigg Boss, Biggboss, Himaja, Love Breakup, Tollywood-Movie

ఇక బిగ్ బాస్ తర్వాత బుల్లితెర సీరియల్స్ కి దాదాపు దూరంగా ఉంటున్న ఈమె వరసగా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హిమజ తన లైఫ్ లో లవ్ బ్రేకప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.తనకు తన జీవితంలో పెద్దగా లవ్ లెటర్స్ ప్రపోజల్స్ రాలేదని, కాంప్లిమెంట్ గా ఫ్లవర్స్ మాత్రమే వచ్చాయని చెప్పింది.దీంతో మిమ్మల్ని ఎవరూ లవ్ చేయరా అంటూ ప్రశ్నించారు.

ఎందుకు చేయరు చాలామంది నన్ను లవ్ చేశారు.నేను వారిని లవ్ చేశాను.కానీ, ఇప్పుడు ఎవరి లైఫ్ వారిది.దాన్ని బ్రేకప్ అని చెప్పి లవ్ వ్యాల్యూను తీయలేను.కానీ, ఒకసారి లవ్ చేస్తే లైఫ్ లాంగ్ ఆ ప్రేమ అలాగే ఉండిపోతుంది.ప్రేమ అనేది సినిమాలోని క్యారెక్టర్ లాంటిది కాదు అంటూ తెలియజేశారు.

Telugu Bigg Boss, Biggboss, Himaja, Love Breakup, Tollywood-Movie

ఇక నేను ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఒక అబ్బాయి ప్రేమలో పడ్డాను తను కూడా నన్ను ప్రేమించారు.తన లవ్ స్టోరీ గురించి చెబుతూ కొంతమంది గురించి చెప్తే కాపురాలు కూలిపోతాయని టైటిల్ పెట్టి ప్రచారం చేస్తున్నారని , ఆ టైటిల్ కి ఆ వీడియోలో ఉన్న కంటెంట్ కి ఏమాత్రం సంబంధం ఉండదని తెలిపారు.ఆ ఇంటర్వ్యూ చేసింది నా స్నేహితురాలే.అది వ్యూస్ కోసం అలా టైటిల్ పెట్టిందని ఈ సందర్భంగా హిమజ తెలిపారు.ఎప్పుడు స్కూల్ డేస్ లో ప్రేమ గురించి ఇప్పుడు నేను బయట పెడితే బాగుండదని ఇప్పుడు వారు పెళ్లిళ్లు చేసుకొని హ్యాపీగా ఉంటారు అలాంటిది నేను వారి పేర్లు చెప్పి డిస్టర్బ్ చేయడం ఎందుకనే ఉద్దేశంతో అలా మాట్లాడాను అంటూ హిమజ క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube