ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో( Border-Gavaskar Trophy ) టీమిండియా 1-3తో ఓటమిపాలైన విషయం తెలిసిందే.ఈ సిరీస్‌లో టీమిండియాకు కీలక బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా( Jasprit Bumrah ) అద్భుత ప్రదర్శన చేసిన విష్యం తెలిసిందే.
ఐదు టెస్టుల్లో మొత్తం 32 వికెట్లు తీసిన బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా( Player of the Series ) నిలిచాడు.ఈ సిరీస్ లో బుమ్రా తన ప్రతిభతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాడు.
కానీ చివరి టెస్టు మ్యాచ్ లో వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రా టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కూడా చేయలేకపోయాడు.మ్యాచ్ మధ్యలోనే అతడిని ఆసుపత్రికి తీసుకవెళ్ళింది టీమిండియా మేనేజ్‌మెంట్.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 150కి పైగా ఓవర్లు వేయడం వల్లే అతడి వెన్ను నొప్పి( Back Pain ) మరింతగా ఎక్కువైందని టీమిండియా మేనేజ్‌మెంట్ అనుకుంటుంది.దీనితో, అతడిని మరింతగా ఆడించడం పై మేనేజ్మెంట్ అసలు ఆసక్తి చూపడం లేదు.ప్రస్తుతం బుమ్రా భారత్ లో ఇంగ్లండ్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరంగా ఉండే అవకాశముంది.
జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డా, అతడిని ఫిబ్రవరి 19న ఆరంభమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంచేందుకు బీసీసీఐ వైద్య బృందం కసరత్తులు చేస్తోంది.ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తమ మొదటి మ్యాచ్ ఆడనుంది.బుమ్రా లాంటి కీలక ఆటగాడు ఆ టోర్నీలో జట్టుకు ఎంతో అవసరమని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది.
దాంతో జట్టు అభిమానులు ఇప్పుడు బుమ్రా త్వరగా కోలుకొని మళ్లీ ఫీల్డ్‌లో రాణించాలి అని ఆశిస్తున్నారు.బీసీసీఐ వైద్య బృందం ఇంకా బుమ్రా గాయం తీవ్రతను పూర్తి స్థాయిలో అంచనా వేయలేదు.
ఒకవేళ అంచనా తర్వాత గాయం తీవ్రత ఆధారంగా బుమ్రా మళ్లీ బరిలోకి దిగే తేదీని నిర్ణయించనున్నారు.