నీతులు చెప్పడమే కాదు పాటించాలిగా.. అనంత్ శ్రీరామ్ ఓల్డ్ సాంగ్స్ లిరిక్స్ పై విమర్శలు?

టాలీవుడ్ సింగర్ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్(Anantha Sriram) తాజాగా హిందూ ధర్మం గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.హైందవ శంఖారావం(Hindu Sankharavam) సభలో సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

 Anantha Sriram Faces Backlash For Past Lyrics And Comments, Anantha Sriram, Back-TeluguStop.com

ఆయన భారత, రామాయణ, భాగవతాల్లో(Bharata, Ramayana, Bhagavata) పురాణాలను ఇష్టం వచ్చినట్టు కొందరు మార్చేశారని అన్నారు.సినిమాల్లో కర్ణుడు పాత్రకు ఎలివేషన్ ఇవ్వడం పై అభ్యంతరాలను వ్యక్తం చేశాడు.

ఒక పాటలో బ్రహ్మాండ నాయకుడు అనే పదం వద్దన్నందుకు 15 ఏళ్లుగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కు పాటలు రాయలేదని అనంత శ్రీరామ్ తెలిపాడు.

Telugu Anantha Sriram, Backlash, Bhagavata, Bharata, Dhigudhigu, Ramayana, Tolly

అలాగే హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం నిషేధించాలని, లేదంటే హిందువులే పూర్తిగా ఆ చిత్రాలను బహిష్కరించాలని, అప్పుడే హిందూ ధర్మానికి ఒక గౌరవం ఉంటుందని చాలా పెద్ద స్పీచ్ ఇచ్చాడు.దీంతో అనంత శ్రీరామ్(Anantha sriram) పై ప్రశంసలతో పాటు విమర్శల వర్షం కురుస్తోంది.అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఆ వీడియోలు కాస్త వైరల్ అవ్వడంతో పలువురు సినీ, సాహిత్య ప్రముఖులు ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టారు.ప్రధానంగా ఆయన గతంలో రాసిన పాటల్లోని సాహిత్యాన్ని టార్గెట్ చేసుకొని ట్రోల్ చేస్తున్నారు.

నాగ శౌర్య నటించిన వరుడు కావలెను సినిమాలో అనంత శ్రీరామ్ రాసిన దిగు దిగు దిగు నాగ పాట(Dhigu Dhigu Dhigu Naga) వివాదానికి కేరాఫ్ గా నిలుస్తోంది.

Telugu Anantha Sriram, Backlash, Bhagavata, Bharata, Dhigudhigu, Ramayana, Tolly

నాగరాజుపై ప్రేమతో పాడుకునే భజన గీతాన్ని ఐటమ్ సాంగ్ గా మార్చారని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.అప్పట్లోనే హిందువుల మనోభావాలను కించపరిచేలా ఈ సాంగ్ ఉందని, వెంటనే తొలగించి బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ సంస్థ డిమాండ్ చేసింది.పాట రాసిన అనంత శ్రీరామ్ పై బీజేపీ మోర్చా నాయకులు పలు చోట్ల కేసులు పెట్టారు.

దేవుడిని కించపరిచేలా లిరిక్స్ రాశాడని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ మండిపడ్డారు.అనంత శ్రీరామ్‌ తో పాటు సినిమా యూనిట్‌ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.

తనలో అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో  మూడేళ్ల క్రితం జరిగిన ఈ వ్యవహారాన్ని నెటిజన్లు ఇప్పుడు బయటకు లాగారు.ఇప్పుడు హైందవ ధర్మం గురించి మాట్లాడుతోన్న అనంత శ్రీరామ్ హిందూత్వాన్ని, హిందూ సంప్ర‌దాయాల్నీ కించ‌ప‌రిచేలా అప్పుడు సాంగ్ ఎలా రాసాడని కామెంట్స్ చెస్తున్నారు.

అలాగే గరికపాటి పై కూడా గతంలో అనంత్ శ్రీరామ్ తన స్థాయికి మించి కామెంట్స్ చేసిన విషయాన్ని మరోసారి వెలుగులోకి తెస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube